Sunday, December 29, 2019

Do these thing before 1st january



Read also:

కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎక్కడ న్యూ ఇయర్‌కు వెల్ కం చెబుదాం.ఎలా చెప్పాలి.పార్టీ ఎలా చేసుకోవాలనే దానిపై మాట్లాడుకుంటూ.బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇదంతా ఒకే.కానీ మీకు కొన్ని విషయాలు గుర్తు ఉన్నాయా ? అవి మీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించినవి.

ఎందుకంటే.2020లో బ్యాకింగ్ రంగంలో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరి ఇవి ఇప్పటికే చేసి ఉంటే..బెటర్ లేకుంటే వెంటనే చేసేయండి..లేకుంటే సమస్యలు ఎదురు కాక తప్పదు.

ఎంపిక చేసిన లావాదేవీలపై MDR ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ప్రకటించారు. అయితే ..ఇది కొత్త సంవత్సరం 2020, జనవరి 01వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.

ఐటీ రిటర్న్ :

ఐటీ రిటర్న్స్ సమర్పించారా ? లేకపోతే వెంటనే ఇచ్చేయండి. డిసెంబర్ 31లోపు చెల్లిస్తే..రూ. 5 వేలతో చెల్లించొచ్చని ఐటీ అధికారులు వెల్లడించారు. అలా కాక..ఇంకా టైం ఉంది అంటే మాత్రం మీ జేబుకు భారీగా చిల్లు పడినట్లే. గడువు దాటితే రూ. 10 వేల పెనాల్టీ చెల్లించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటంది.More Info

SBI కొత్త విధానం :

బ్యాకింగ్ రంగంలో ఉన్న SBI కొత్త కొత్త విధానాలను ముందుకు తీసుకొచ్చింది. ATM మోసాలకు చెక్ పెట్టేందుకు OTPని ప్రవేశ పెట్టింది. అంటే..2020, జనవరి 01 నుంచి రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య రూ. 10 వేలు, లేదా..ఆ పైబడి డబ్బులు తీయాలని అనుకుంటే..మాత్రం మీరు నమోదు చేసుకున్న మొబైల్‌కు వచ్చే OTPని టైప్ చేయాల్సిందే. ఎలాంటి మోసాలకు గురి కావద్దొనే దీనిని తీసుకొచ్చారు. అయితే..కేవలం ఎస్‌బీఐ వినియోగదారులు, ఎస్‌బీఐ ఏటీఎంల్లో చేసే లావాదేవీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.More Info

SBI డెబిట్ కార్డు :

అదే విధంగా SBI డెబిట్ కార్డు మార్చుకోవాల్సిందేనంటూ బ్యాంకు యాజమాన్యం వెల్లడించింది. మాగ్నిటిక్ స్ట్రిప్ లేని వారు మాత్రమే. ఏటీఎం కమ్ డెబిట్ కార్డుల్లో ఈ సౌకర్యం లేకపోతే..వెంటనే బ్యాంకులకు వెళ్లాల్సిందే. ఈఎంవీ చిప్‌తో కూడిన కార్డుకు అప్లై చేయండి. లేనిపక్షంలో సమీప బ్యాంకు శాఖను సంప్రదించండి. ఆఫ్టర్ డిసెంబర్ 31 పాత కార్డులు చెల్లవని ఎస్‌బీఐ ప్రకటించింది.

పాన్ - ఆధార్ లింక్ : -

పాన్ - ఆధార్ లింక్ చేసుకోవాల్సిందే. అది డిసెంబర్ 31 లాస్ట్ డేట్. ఏప్రిల్ 01 నుంచి వీటి అనుసంధానం చేసుకోవాల్సిందేనంటూ ఐటీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31 దాటితే మీ పాన్ కార్డు పనిచేయకుండా పోతుంది. ప్రధానంగా ఐటీఆర్ సమర్పించే వాళ్లు అస్సలు మరిచిపోకూడదు.More Info

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :