Read also:
AP Inter Hall Tickets -2021
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలు, వాటి నిర్వహణ తదితర అంశాలను మంత్రి వివరించారు.
కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మే 5 నుంచి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యార్థలు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈరోజు(ఏప్రిల్ 29) సాయంత్రం ఆరు గంటల నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా విద్యార్థులకు సూచించారు.
1 Comments:
Write CommentsHi
Reply