Sunday, June 4, 2023

ఒడిశా రైలు ఘోర ప్రమాదానికి మూల కారణం ఇదే: రైల్వే మంత్రి వైష్ణవ్Read also:

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన మూడు రైళ్లు ఢీకొని జరిగిన ఘోర ప్రమాదానికి గు మూలకారణాన్ని గుర్తించినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం తెలిపారు. ప్రమాద స్థలంలో ఉన్న మంత్రి  ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, రైలు ప్రమాదంపై దర్యాప్తు పూర్తయిందని, రైల్వే భద్రతా కమిషనర్ త్వరలో నివేదికను సమర్పిస్తారని చెప్పారు. ఎలక్ట్రిక్ ఇంటర్‌ లాకింగ్‌లో మార్పు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంపై దర్యాప్తు పూర్తయ్యిందని చెప్పారు. ప్రభుత్వానికి నివేదిక అందిన వెంటనే బయటకు పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. 

Odissa Train Accident

  • ఎలక్ట్రిక్ ఇంటర్ లాకింగ్‌లో మార్పే కారణమని గుర్తించామని వెల్లడి
  • ప్రమాదంపై దర్యాప్తు పూర్తయ్యిందనన కేంద్ర మంత్రి
  • ప్రభుత్వానికి నివేదిక అందిన తర్వాత పూర్తి వివరాలు ప్రకటిస్తామన్న అశ్విన్

మూడు రైళ్లు ఢీకొన్న ప్రాంతాన్ని ఆదివారం ఉదయం సందర్శించారు. ప్రమాదస్థలంలో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, 1000 మందికిపైగా ఒడిశా కార్మికులు శ్రమిస్తున్నారని ఆయన తెలిపారు.  రైల్వే ట్రాకుల పునరుద్ధరణను ఈ రోజే పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. బుధవారం ఉదయం నాటికల్లా పనులన్నీ పూర్తి చేసి, ఆ రూట్లో సర్వీసులు పునరుద్ధరణ అవుతాయని పేర్కొన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :