Sunday, December 29, 2019

Assigning a high power committe for ap captial



Read also:

ఏపీ సమగ్రాభివృద్దిపై హైపవర్ కమిటీ ఏర్పాటయ్యింది. జీఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలను..హైపవర్ కమిటీ అధ్యయనం చేయనుంది. కమిటీలో మొత్తం 10 మంది మంత్రులు సహా మొతంతం 16 మంది సభ్యులు ఉన్నారు. కాగా అభివృద్ది వికేంద్రీరణపై అధ్యయనం చేసి మూడు వారాల్లోగా సూచనలు ఇవ్వాలని హైపవర్ కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీకి అధ్యక్షుడిగా మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ వ్యవహరించనున్నారు.

హైపవర్‌ కమిటీలో ఉన్న సభ్యులు ఎవరంటే :

ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన
రెవిన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్
మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స
పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి
విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌
హోంమంత్రి సుచరిత
వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు
మత్స్య, మార్కెటింగ్‌ శాఖల మంత్రి మోపిదేవి
పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
రవాణా శాఖ మంత్రి పేర్ని నాని
ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లం
డీజీపీ గౌతం సవాంగ్‌
సీసీఎల్‌ఏ, చీఫ్‌ సెక్రటరీ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ సెక్రటరీ, లా సెక్రటరీలు
ఇక సీఎస్ నీలం సాహ్ని హైపవర్‌ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :