Friday, December 27, 2019

New rule for SBI customers



Read also:

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కస్టమర్లు నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. ఎప్పటికప్పుడు అలెర్ట్ మెసేజ్‌లు ఇస్తున్నా మోసాల బారిన పడుతున్నారు. ఈసారి మరింత పడబ్భందీగా ఏటీఎం మోసాలను అరికట్టేందుకు మరో కొత్త నిర్ణయం తీసుకుంది. దీంతో తన ఖాతాదారులకు ప్రయోజనం కలుగుతుందని ఎస్‌బీఐ భావిస్తోంది. వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) ఆధారిత క్యాష్ విత్‌డ్రా సేవలు అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించింది. అయితే అన్ని లావాదేవీలకు ఇది వర్తించదు. కేవలం రూ.10,000 పైన ఉన్న ట్రాన్సాక్షన్లకు మాత్రమే వర్తిస్తుంది.
బ్యాంక్ ఖాతాదారులు ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవాలని ప్రయత్నిస్తే.. అప్పుడు బ్యాంక్ అకౌంట్‌తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే డబ్బు తీసుకునే వీలుంటుంది. దీంతో మోసపూరిత లావాదేవీలకు చెక్ పెట్టొచ్చని బ్యాంక్ భావిస్తోంది. ఈ ఓటీపి ఏటీఎం క్యాష్ విత్ డ్రా ఫెసిలిటీ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీరు మీ కార్డుని మరో బ్యాంకులో ఉపయోగిస్తే అక్కడ ఓటీపీ పనిచేయదు. కేవలం ఎస్‌బీఐలో మాత్రమే పనిచేస్తుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :