Thursday, September 5, 2019

how to check income Tax refund status



Read also:

ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ వచ్చిందా లేదో  స్టేటస్ తెలుసుకోండి ఇలా

ఐటీ రిటర్న్ ఫైల్ చేసే సమయంలో అడ్వాన్స్ ట్యాక్స్ , సెల్స్ క్యాలిక్యులేటెడ్ ట్యాక్స్ , టీడీఎస్ లాంటి పన్నులు ప్రభుత్వానికి చెల్లిస్తుంటారు ట్యాక్స్ పేయర్స్ .మీరు ఐటీ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత ఆదాయపు పన్ను శాఖ మీ ఐటీఆర్ ని ప్రాసెస్ చేసి ట్యాక్స్ రీఫండ్ ఏదైనా ఉంటే క్రెడిట్ చేస్తుంది . ఇందుకు సంబంధించిన సమాచారం ఇమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా మీకు తెలుస్తుంది .ఆదాయపు పన్ను చట్టంలోని 143 ( 1 ) సెక్షన్ కింద మీకు ఈ సమాచారం లభిస్తుంది . రీఫండ్ ఏదైనా ఉంటే మీ బ్యాంకు అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. 
IT-Refund
మరి మీరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేశారా ?
పన్నులు చెల్లించారా ?
ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారా ?
మీ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ స్టేటస్ ని ట్రాక్ చేయొచ్చు . ఎలాగో తెలుసుకోండి

IT Refund Status : 

  • ఇ - ఫైలింగ్ వెబ్ సైట్ లో చెక్ చేసుకోండి ఇలా ముందుగా ఇ - ఫైలింగ్ వెబ్ సైట్ ఓపెన్ చేయండి . 
  • Portal login పైన క్లిక్ చేయండి . 
  • పాన్ నెంబర్ , ఇ - ఫైలింగ్ పాస్వర్డ్ , క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి . 
  • View returns / forms పైన క్లిక్ చేయాలి . 
  • డ్రాప్ డౌన్ మెనూలో Income Tax Returns పైన క్లిక్ చేసి submit _ బటన్ ప్రెస్ చేయాలి . 
  • అక్నాలెడ్జిమెంట్ నెంబర్ పైన క్లిక్ చేస్తే ఐటీ  రీఫండ్ వివరాలు కనిపిస్తాయి . 
  • ఒకవేళ మీ రీఫండ్ ఫెయిల్ అయినట్టైతే రీఫండ్ రీఇష్యూ రిక్వెస్ట్ సబ్మిట్ చేయొచ్చు .

IT Refund Status

  • TIN NSDL వెబ్ సైట్ లో చెక్ చేసుకోండి ఇలా TIN - NSDL వెబ్ సైట్ ఓపెన్ చేయండి . 
  • Services ట్యాబ్ లో Status of Tax Refunds పైన క్లిక్ చేయండి . కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • status of Income Tax Refunds పైన క్లిక్ చేయండి . 
  • Refund Tracking పేజీ ఓపెన్ అవుతుంది . 
  • PAN నెంబర్ , అసెస్మెంట్ ఇయర్ , క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి .
  • Proceed పైన క్లిక్ చేస్తే మీకు రీఫండ్ వివరాలు తెలుస్తాయి .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :