Wednesday, December 11, 2019

Aadhar pan linking last date 31 dec



Read also:

PAN-Aadhaar Link: డిసెంబర్ 31 లోగా పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా

మీరు మీ పాన్ కార్డుకు ఆధార్ నెంబర్‌ను లింక్ చేశారా? ఇంకా లింక్ చేయలేదా? పాన్-ఆధార్ నెంబర్లు లింక్ చేయడానికి డిసెంబర్ 31 చివరి తేదీ. పాన్ కార్డు ఉన్నవాళ్లందరూ తమ ఆధార్ నెంబర్లను పాన్ కార్డుతో లింక్ చేయాల్సిందే. పాన్-ఆధార్ లింక్ చేయాలంటూ ఆదాయపు పన్ను శాఖ చాలాకాలంగా చెబుతోంది. అనేక సార్లు డెడ్ లైన్స్ విధించింది. ఇప్పటికే 7 సార్లు చివరి తేదీలను పొడిగించింది. డిసెంబర్ 31 చివరి తేదీ అని కొంతకాలం క్రితమే ప్రకటించింది. అయినా ఇప్పటివరకు పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయనివాళ్లున్నారు. ఈసారి ప్రభుత్వం చివరి తేదీ పొడిగించే అవకాశం కనిపించట్లేదు. డిసెంబర్ 31 లోగా ఎవరైనా పాన్-ఆధార్ లింక్ చేయాల్సిందే. లేకపోతే ఆధార్ నెంబర్ లింక్ చేయని పాన్ కార్డులు చెల్లవని, వాటిని ఉపయోగించడానికి వీల్లేదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్-CBDT ప్రకటించే అవకాశముంది.
డెడ్‌లైన్ తర్వాత ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులు 'పనిచేయనివి'గా గుర్తించాలని ఫైనాన్స్ బిల్లులో సైతం వెల్లడించింది ప్రభుత్వం.

పాన్ కార్డుకు ఆధార్ నెంబర్‌ను లింక్ చేయడానికి 4 మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకోండి.

1. SMS: మీరు మీ ఆధార్ నెంబర్‌ను పాన్ కార్డుతో ఆన్‌లైన్‌లో లింక్ చేయొచ్చు. ఇందుకోసం మీరు 567678 లేదా 56161 నెంబర్లకు కింద సూచించిన ఫార్మాట్‌లో ఎస్ఎంఎస్ పంపాలి.

UIDPAN<space><12 అంకెల ఆధార్><space><10 అంకెల పాన్>
ఉదాహరణ: UIDPAN 111122223333 AAAPA9999Q

2. Online: ముందుగా incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్‌లో పాన్-ఆధార్ నెంబర్లు లింక్ చేయొచ్చు. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు 'Linking Aadhaar' లింక్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. కొత్త పేజీలో ఆధార్‌కార్డుపై ఉన్న మీ పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి 'Link Aadhaar' పైన క్లిక్ చేస్తే మీ పాన్‌ కార్డుతో ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది.

3. Income Tax Returns (ITR): మీరు ఇ-ఫైలింగ్ ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో కూడా మీ పాన్-ఆధార్ లింక్ చేసే అవకాశం కల్పిస్తోంది ఆదాయపు పన్ను శాఖ. NSDL (tin-nsdl.com), UTIITSL (utiitsl.com) వెబ్‌సైట్లల్లో ఐటీఆర్ ఫైలింగ్ చేసేప్పుడు పాన్-ఆధార్ లింక్ చేయాలి.

4. PAN Card Application: ఇక కొత్తగా పాన్ కార్డు తీసుకునేవాళ్లు, పాన్ కార్డులో మార్పులు చేయించేవాళ్లు దరఖాస్తులోనే ఆధార్ నెంబర్ వివరిస్తే సరిపోతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :