Wednesday, March 17, 2021

March 31 Last Date: అలర్ట్-ఈ పనులన్నింటికీ మార్చి 31 చివరి తేదీ



Read also:

March 31 Last Date | నిత్యం ఆర్థిక లావాదేవీల్లో బిజీగా ఉండేవారికి అలర్ట్. ఆర్థిక వ్యవహారాలు, పర్సనల్ ఫైనాన్స్‌కు సంబంధించి చాలా అంశాలకు 2021 మార్చి 31 చివరి తేదీ. అవేంటో తెలుసుకోండి.

1. PAN Aadhaar Linking: పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ నెంబర్లు లింక్ చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ. ఈ గడువు 2020 జూన్ 30న ముగియడంతో గడువును 2021 మార్చి 31 తేదీ వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. అప్పట్లోగా పాన్, ఆధార్ నెంబర్లను లింక్ చేయకపోతే పాన్ కార్డు పనిచేయదు.

2. LTC Cash Voucher Scheme: ఎల్‌టీసీ క్యాష్ వోచర్ స్కీమ్ ద్వారా పన్ను మినహాయింపు పొందేందుకు 2021 మార్చి 31 చివరి తేదీ. 2020 అక్టోబర్‌లో ఈ స్కీమ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మొదట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ స్కీమ్ ప్రకటించింది. ఆ తర్వాత ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులకు కూడా ఈ స్కీమ్ అమలు చేసింది.

3. ITR Filing: 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రివైజ్డ్, బిలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ. రూ.10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రూ.5,00,000 లోపు ఆదాయం ఉన్నవారు రూ.1,000 జరిమానా చెల్లించాలి.

4. Tax Saving: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ట్యాక్స్ సేవింగ్స్ చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ.

5. Vivad Se Vishwas Scheme: వివాద్ సే విశ్వాస్ స్కీమ్‌కు సంబంధించి పేమెంట్స్ చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ. అంటే 2021 జనవరి 31 లోగా డిక్లరేషన్ ఇచ్చి 2021 మార్చి 31లోగా పేమెంట్ చేయాలి. 

6. Emergency Credit Line Guarantee Scheme: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ 2021 మార్చి 31న ముగుస్తుంది. ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2020 మే 13న ఈ స్కీమ్ ప్రకటించింది. 

7. LTC Cash Voucher Scheme: ఎల్‌టీసీ క్యాష్ వోచర్ స్కీమ్‌లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ ద్వారా రూ.10,000 పొందేందుకు 2021 మార్చి 31 చివరి తేదీ. ఈ మొత్తాన్ని 10 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది.

8. Pradhan Mantri Awas Yojana: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-PMAY స్కీమ్‌లో భాగంగా క్రెడిట్ సబ్సిడీ పొందేందుకు 2021 మార్చి 31 లాస్ట్ డేట్. మిడిల్ ఇన్‌కమ్ గ్రూప్స్ అంటే రూ.6,00,000 నుంచి రూ.18,00,000 మధ్య వార్షికాదాయం ఉన్నవారు సబ్సిడీ పొందొచ్చు.

Complete ESR Information

E-SR Scan process-ESR కోసం Orginal/Physical SR మీద స్టాంప్‌ లు వేసేటప్పుడు👇

https://www.generalissues.info/2021/03/esr-scanning-process-esr.html

ESR: GO99 DATED 03-12-20 ప్రకారం STO లెవెల్ లో CROSS VERIFY చేయు అంశాలు👇

https://www.generalissues.info/2021/03/esr-goms-no-99-sto-cross-verify.html

E SR నందు మనం Upload చేయవలసినకొన్ని సర్టిఫికెట్లు/డాక్యుమెంట్లు👇

https://www.generalissues.info/2021/01/esr information_18.html

Check your ESR data entry status Report👇

https://www.generalissues.info/2021/03/ap esr data entry status report.html

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :