Wednesday, March 31, 2021

భారతీయ రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైల్వే ప్రయాణికులు రాత్రి సమయంలో ఛార్జింగ్ పాయింట్లను ఉపయోగించుకునే అవకాశం ఉండదు



Read also:

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైల్వే ప్రయాణికులు రాత్రి సమయంలో ఛార్జింగ్ పాయింట్లను ఉపయోగించుకునే అవకాశం ఉండదు. మార్చి 13న ఢిల్లీ-డెహ్రాడూన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక బోగీలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం మరో ఏడు కోచులకు వ్యాపించింది.


పొగ రాయుళ్ల వేటు, భారీ జరిమానాలు ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ రాత్రి సమయంలో ఛార్జింగ్ వినియోగించకుండా చర్యలు తీసుకుంటోంది.

అంతేగాక, రైళ్లలో పొగరాయుళ్లను పసిగట్టేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. పొగతాగితే భారీ జరిమానాలను వేసేందుకు సిద్ధమైంది. అంతేగాక, రైల్వే యాక్ట్ 167 ప్రకారం కఠిన శిక్షలు వేయాలని నిర్ణయించింది. ప్రయాణికులు ఎవరైనా పొగతాగుతూ కనిపిస్తే రూ. 100 జరిమానా విధించనున్నారు.

రైళ్లలో ఇక రాత్రిపూట ఛార్జింగ్ పాయింట్లు పనిచేయవు రైల్వే ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని.. రైళ్లలోని ఛార్జింగ్ పాయింట్లకు రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఆఫ్ వెస్టెర్న్ రైల్వే సుమిత్ ఠాకూర్ తెలిపారు. రాత్రి సమయంలో దూర ప్రయాణాల్లో మొబైల్, ల్యాప్‌టాప్స్ ఛార్జింగ్ ఎక్కువ సమయం పెట్టడం వల్ల ఓవర్ హీట్ అవడంతో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.

అన్ని రైల్వే జోన్లలో కూడా రాత్రిపూట ఛార్జింగ్ నిలిపివేతను చేపడతామని తెలిపారు.సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శివాజీ సూతర్ మాట్లాడుతూ.. సురక్షిత ప్రయాణం కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. తాజా నిర్ణయాన్ని ప్రయాణికులందరికీ రైళ్లు, రైల్వే స్టేషన్లలో తెలియజేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. రైళ్లలో పనిచేసేవారు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

రైల్వే సిబ్బంది అప్రమత్తం

రాత్రి సమయంలో ఛార్జింగ్ పాయింట్లను నిలిపివేయాలని ఇప్పటికే తాము ఆదేశాలను జారీ చేశామని చేశామని తెలిపారు సదరన్ రైల్వే సీపీఆర్వో బీ గుంగనేశన్ తెలిపారు. ఇప్పటికే ఈ నిర్ణయంపై రైల్వే ఉద్యోగులను అప్రమత్తం చేసింది. ఈ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రైల్వే ప్రయాణికులు తమ మొబైల్స్, ల్యాప్‌టాప్స్ పగటిపూటనే ఛార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :