Wednesday, March 31, 2021

SBI Vcare scheme extended up to June 30



Read also:

SBI Vcare scheme extended up to June 30-ఎస్బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెబుతోంది. తాజాగా 'ఎస్‌బీఐ వీకేర్' గడువును జూన్ 30 వరకు పొడిగించారు. కనుక ఈ సేవలని కూడా ఉపయోగించుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరోనా వైరస్ సంక్షోభాన్ని దృష్టి లో పెట్టుకొని వృద్ధుల కోసం ప్రత్యేకంగా టర్మ్ డిపాజిట్ స్కీమ్‌ను 2020 మే లో తీసుకు వచ్చిన సంగతి తెలిసినదే.

అయితే మొదట సెప్టెంబర్ వరకు గడువు విధించగా తరువాత 2021 మార్చి 31 వరకు మరోసారి గడువును పెంచింది. ఇప్పుడు మరో సరి గడువు పెంచింది. ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేయడానికి మరో మూడు నెలలు అవకాశం ఉంది కాబట్టి సీనియర్ సిటిజన్లు 'ఎస్‌బీఐ వీకేర్' స్కీమ్‌లో డిపాజిట్ చెయ్యవచ్చు.

ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయడం వలన వృద్ధులకు 50 బేసిస్ పాయింట్స్ అంటే అర శాతం వడ్డీ ఎక్కువ లభిస్తుంది. డిపాజిట్ చేయాలంటే వయస్సు 60 ఏళ్ల పైనే ఉండాలి. భార్యా భర్తలు సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కనీసం రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.15,00,000 వరకు డిపాజిట్ చేయొచ్చు.

మొదట ఐదేళ్లకు డిపాజిట్ చెయ్యాలి. అది అయ్యాక మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఐదేళ్ల కన్నా ముందే డబ్బులు విత్‌డ్రా చేస్తే వడ్డీ నష్ట పోవాల్సి ఉంటుంది. 'ఎస్‌బీఐ వీకేర్' స్కీమ్‌ లో డిపాజిట్ ద్వారా సీనియర్ సిటిజన్లు 6.20 శాతం వడ్డీ పొందొచ్చు. ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు మాత్రమే ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి 2021 జూన్ 30 వరకు సమయం వుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :