Sunday, January 3, 2021

అమ్మ వడి రీ వెరిఫికేషన్



Read also:

  • 'అమ్మఒడి' పథకానికి సంబంధించి అర్హులైన తల్లులు లేదా సంరక్షకుల జాబితా తయారీలో భాగంగా  కొందరు విద్యార్థుల వివరాలను రీ వెరిఫికేషన్ చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది.
  • ఆ రి-వెరిఫికేషన్ లో భాగంగా ప్రధానోపాధ్యాయులు చేయవలసింది ఏమిటి?
  • వారు చూడవలసింది వారికి పంపిన జాబితాలో ఉన్న విద్యార్థి పేరు వారి తల్లి పేరు రెండు పేర్లూ కూడా మరొకసారి సరి చూసుకోవటం ఆ వివరాలను వారి ఆధార్ కార్డులతో సరిపోల్చుకోవడం,
  • అలా ధృవీకరించుకోవటానికి తల్లిదండ్రుల కమిటీ లేదా గ్రామ సచివాలయ సిబ్బంది సహాయం తీసుకోవచ్చు.
  • ఆ విధంగా సమాచారాన్ని పరిశీలించినప్పుడు ఆ వివరాలు సరిగా ఉన్నట్లయితే confirmed అని రిపోర్ట్ చేయాలి.
  • అలా కాకపోతే not confirmed అని రిపోర్ట్ చేయాలి.
  • ఏ కారణం వల్లనైనా పూర్తి వివరాలు లభ్యం కాలేకపోతే further verification required  అని రిపోర్ట్ చేయాలి.
  • తల్లి కాక సంరక్షకుల వివరాలు ఉన్నట్లయితే ఆ సంరక్షకుల గుర్తింపులు కూడా పైవిధంగానే ధృవీకరించుకోవాలి.

ప్రస్తుతం  HM  గారి  లాగిన్  లో ఉన్న ఆప్షన్స్:

1. ఎలిజిబుల్ అయి ఉండి బ్యాంకు డీటెయిల్స్ తప్పుగా నమోదు అయితే వాటిని మార్చుకోవచ్చు.
2. వివిధ కారణాల చేత ఇన్ ఎలిజిబుల్ క్యాండిడేట్లు ఎలిజిబుల్ అయి ఉంటే వారిని ఇన్ ఎలిజిబుల్ చేయుటకు.
3. రీవెరిఫికేషన్ కు సంబంధించి మూడు దశల ఆప్షన్లు ఇవ్వడం జరిగింది.
i.  రీ వెరిఫికేషన్ ఎవరెవరిని చెయ్యాలో ఆ లిస్ట్
ii. పై దశ పూర్తి చేసిన తరువాత రీ వెరిఫికేషన్ పిడిఎఫ్ డౌన్లోడ్ చెయ్యవచ్చు
iii. డౌన్లోడ్ చేసిన పిడిఎఫ్ పై అందరి సంతకాలు తీసుకుని అప్లోడ్ చేయుటకు.
(Note: జగనన్న అమ్మ ఒడి కి సంబంధించి మార్పులు చేర్పులకు జనవరి 5వ తేదీ వరకు అవకాశం కలదు)

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :