Monday, January 4, 2021

Airtel to Jio porting



Read also:

ఎయిర్‌టెల్ నుంచి జియోకు పోర్ట్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
మంచి నెట్‌వర్క్‌ ఉండే కంపెనీకి, తక్కువ ధరల్లో ఎక్కువ ప్రయోజనాలు పొందే అవకాశం ఉన్న నెట్‌వర్క్‌కు మారేందుకు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ సదుపాయాన్ని కస్టమర్లు ఉపయోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ నుంచి జియోకు పోర్ట్ అవ్వాలనుకునే వినియోగదారులు ఈ నియమాలను పాటించాల్సి ఉంటుంది.

టెలికాం విభాగంలో నెలకొన్న పోటీతో వినియోగదారులు లబ్ధి పొందుతున్నారు. మంచి నెట్‌వర్క్‌ ఉండే కంపెనీకి, తక్కువ ధరల్లో ఎక్కువ ప్రయోజనాలు పొందే అవకాశం ఉన్న నెట్‌వర్క్‌కు మారేందుకు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ సదుపాయాన్ని కస్టమర్లు ఉపయోగించుకోవచ్చు. భారత టెలికాం రంగంలోకి జియో ప్రవేశించిన తర్వాత టారిఫ్‌ల ధరలు భారీగా తగ్గిపోయాయి. పోటీని తట్టుకుంటూ, కస్టమర్లను కాపాడుకునేందుకు అన్ని సంస్థలూ టారిఫ్‌ల ధరలను తగ్గించాల్సి వచ్చింది. దీంతో తమకు అనుకూలమైన నెట్‌వర్క్‌కు ప్రస్తుత మొబైల్ నంబర్‌ను పోర్ట్ చేసుకునే వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. పోర్టింగ్ ద్వారా పాత నంబర్ కోల్పోకుండా, కొత్త సిమ్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఇష్టమైన నెట్‌వర్క్‌కు మారవచ్చు. పోర్టింగ్ విజయవంతంగా పూర్తయిన తరువాతే ప్రస్తుతం వాడుతున్న ఫోన్‌ నంబర్ కొత్త నెట్‌వర్క్ పరిధిలోకి వస్తుంది. ఎయిర్‌టెల్ నుంచి జియోకు పోర్ట్ అవ్వాలనుకునే వినియోగదారులు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది.

ఎలా పోర్ట్ అవ్వాలంటే

ఎయిర్‌టెల్ నుంచి జియో నెట్‌వర్క్‌కు పోర్ట్ కావాలనుకునే కస్టమర్లు తమ ఫోన్ నంబరు నుంచి <PORT> <space> <ప్రస్తుత ఎయిర్‌టెల్ మొబైల్ నంబర్> టైప్ చేసి 1900కు SMS పంపాలి. ఆ తరువాత వారి యూనివర్సల్ ప్రొడక్ట్ కోడ్ (UPC code) SMS ద్వారా వస్తుంది. దానికి కొన్ని రోజుల వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ఆ తరువాత జియో రిటైలర్ల వద్దకు వెళ్లి పోర్టింగ్ కోసం రిక్వెస్ట్ చేయాలి. ఇందుకు UPC కోడ్, ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేదా ఇతర అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాలి.

ఆ తర్వాత జియో eKYC ప్రక్రియను రిటైలర్ పూర్తి చేస్తారు. ఒకవేళ ప్రస్తుతం ఉపయోగిస్తున్నది ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ నంబర్ అయితే, ముందు ఎయిర్‌టెల్‌ బకాయిలను వినియోగదారులు పూర్తిగా చెల్లించాలి. ఆ తరువాత మూడు నుంచి ఐదు పనిదినాల్లో పోర్టింగ్ పూర్తవుతుంది. ఈ సమయంలో ఎయిర్‌టెల్ సేవలే కొనసాగుతాయి. పోర్టింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత జియో నెట్‌వర్క్‌కు మారే సమయం, సంబంధిత వివరాలు SMS ద్వారా కస్టమర్ల ఫోన్ నంబర్‌కు వస్తాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :