Monday, January 4, 2021

Corona Vaccination



Read also:

కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కోసం కోవిన్(Co-WIN App) ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇందులో రిజిస్టరై వివరాలను తెలుసుకోవచ్చు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్(Corona Vaccine) ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తోంది. అత్యవసర చికిత్సా విభాగం కింద భారత ప్రభుత్వం కూడా రెండు వ్యాక్సిన్లకు అనుమతిచ్చింది. అయితే అత్యవసర వినియోగం మినహా మిగతా సందర్భాల్లో డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(SII), భారత్ బయోటెక్ తయారు చేసిన టీకాలకుఅత్యవసర వినియోగ అధికారాన్ని ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కోసం కోవిన్(Co-WIN App) ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇందులో రిజిస్టరై మిగిలిన వివరాలను తెలుసుకోవచ్చు. జులైలోపు టీకాలను 25 నుంచి 30 కోట్ల మంది అందించాలని కేంద్రం యోచిస్తోంది. అందులోనూ మొదటి ప్రాధాన్యత హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లుకు ఇవ్వనుంది. అనంతరం వయోవృద్ధులు, వైద్యపరంగా అత్యవసరమైన రోగులకు అందించే అవకాశముంది. ఈ కారణంగా సాధారణ ప్రజలకు ఈ టీకాలు ఇచ్చేందుకు మరికొంత సమయం పడుతుంది.

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేవారు ముందుగా కేంద్ర ఆరోగ్యశాఖ రూపొందించిన కోవిన్ ప్లాట్ ఫామ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లబ్దిదారులకు టీకా ఇచ్చే సమయం, ప్రాంతం వంటి వివరాలను ముందుగా అధికారులు అందులో పొందుపరుస్తుతారు. రెండో డోసుకు సంబంధించిన సమచారం కూడా అందులోనే ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏవైనా దుష్ప్రభావాలు ఎదురైతే కోవిన్ ద్వారా రిపోర్ట్ చేయడం లేదా అందులో ఉండే కాల్ సెంటర్లకు తెలియజేసే వీలుంటుంది. రెండు డోసులు పూర్తయిన తర్వాత ఈ-సర్టిఫికేట్ కూడా ఈ యాప్ ద్వారానే పొందవచ్చు.
కోవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్ ఎలా
  • కోవిన్ యాప్ ద్వారా ఏ వ్యక్తి అయినా ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇది గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్లో లభ్యమవుతుంది. అంతేకాకుండా కైయోస్ లో నడుస్తున్న డివైజ్ లకు కూడా అందుబాటులో ఉంటుంది. ఈవిన్ మొబైల్ యాప్ అప్ గ్రేడెడ్ వర్షన్.
  • అడ్మినిస్ట్రేటర్ మాడ్యూల్, రిజిస్ట్రేషన్ మాడ్యుల్, వ్యాక్సిన్ మాడ్యూల్, బెనిఫిషియరీ అక్నాలెడ్జ్ మెంట్ మాడ్యూల్ (లబ్దిదారుల రసీదు మాడ్యూల్), రిపోర్ట్ మాడ్యూల్ అనే 5 మాడ్యుల్స్ కోవిన్ ప్లాట్ ఫాంలో ఉంటాయి.
  • ఫ్రంట్ లైన్ కాని పౌరులు(ఆరోగ్య కార్యకర్తలు) రిజిస్ట్రేషన్ మాడ్యూల్ ద్వారా టీకా పొందడానికి నమోదు చేసుకోవచ్చు. సామాన్య ప్రజలకు యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ మాడ్యూల్ ఓపెన్ అవుతుంది.
  • రిజిస్ట్రేషన్ కోసం ఫొటో గుర్తింపు(ID) అవసరం. అడ్మినిస్ట్రేటర్ మాడ్యూల్ ఉపయోగించిన పౌరులు అందించిన సమాచారాన్ని నిర్వాహకులు ట్రాక్ చేస్తారు.
  • సెషన్లు ప్రారంభించడానికి నిర్వహాకులు కూడా బాధ్యత వహిస్తారు. దీనికి సంబంధించిన నొటిఫికేషన్లు.. వాక్సినేటర్లకు, నిర్వాహకులకు వస్తాయి.
  • యాప్ లోని వ్యాక్సిన్ మాడ్యూల్ లబ్దిదారుడి వివరాలను ధ్రువీకరిస్తుంది. ఇది వారి టీకా స్థితిని అప్డేట్ చేస్తుంది. బెనిఫిషియరీ అక్నాలెడ్జ్ మెంట్ మాడ్యూల్(లబ్దిదారుడి రసీదు) నుంచి లబ్దిదారులకు సంబంధిత సమాచారం ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. డోసులు ఇచ్చిన అనంతరం క్యూఆర్ ఆధారిత ధ్రువపత్రాలను కూడా జారీ చేస్తుంది.
  • రిపోర్టు మాడ్యూల్ అనేది ఎన్ని టీకా సెషన్లు నిర్వహించారు, ఎంత మంది హాజరయ్యారు, ఎంత మంది తప్పుకున్నారు లాంటి సమాచారాన్ని సమగ్రమైన నివేదికల రూపంలో సిద్ధం చేస్తుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :