Thursday, December 24, 2020

Fast tag is mandatory from January 1st



Read also:

Fast tag is mandatory from January 1st

వాహన యజమానులు తమ ఫాస్ట్ ట్యాగ్లను ఆన్‌లైన్‌లో రీఛార్జ్ చేసుకోవాలి. సాధారణ సేవా కేంద్రాలు, పెట్రోల్ పంపులు, బ్యాంక్ శాఖల్లో ట్యాగ్‌లు అందుబాటులో ఉంటాయి. అయితే, వినియోగదారులు తమ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెఫ్ట్, ఆర్‌టిజిఎస్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో వీటిని రీఛార్జ్ చేసుకోవచ్చు.

జనవరి 1 నుంచి అన్ని ఫోర్ వీలర్ వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నూతన ఫాస్ట్‌ట్యాగ్ విధానంతో జనవరి 1 నుంచి వంద శాతం టోల్ వసూలు చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. దీంతో పాటు టోల్ గేట్ల వద్ద నగదు లావాదేవీలకు స్వస్తి పలకనుంది. తద్వారా ప్రయాణీకులు టోల్ గేట్ల వద్ద ఎక్కువ సేపు ఆగే బాధ తప్పనుంది. 2021 జనవరి 1 నుంచి ఫాస్ట్‌ట్యాగ్ విధానం ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇకపై ఫాస్ట్‌ట్యాగ్ ఉన్న కార్లను మాత్రమే టోల్ గేట్ల దగ్గర అనుమతిస్తారు. ఈ మేరకు భారతదేశంలోని మొత్తం ఫోర్ వీలర్ వాహనాల కోసం ఫాస్ట్ ట్యాగ్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI చేత పరిచయం చేయబడిన, ఈ ఫాస్ట్ ట్యాగ్ విధానం అనేది కారు విండ్‌షీల్డ్‌లో అతికించడానికి ఒక స్టిక్కర్. ఇది టోల్ ప్లాజాల వద్ద టోల్ ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ సేకరణను అనుమతిస్తుంది. మన వాహనాల విండ్స్క్రీన్పూ ఉంచే ఫాస్ట్‌ట్యాగ్ స్టిక్కర్లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఇది టోల్ ప్లాజాలోని స్కానర్కు నేరుగా కనెక్ట్ అవుతుంది. తద్వారా మన ఖాతా నుంచి డబ్బులు నేరుగా కట్ అయిపోతాయి టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్‌ట్యాగ్ ఉంటే తప్ప జనవరి 1 నుంచి అనుమతి ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఫాస్ట్ ట్యాగ్ పొందటం ఎలా?

అధీకృత పాయింట్-ఆఫ్-సేల్ ప్రదేశంలో కొనుగోలు చేయడానికి ఫాస్ట్‌ట్యాగ్‌లు అందుబాటులో ఉన్నాయి. వాహన వినియోగదారులు తమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్‌సి)తో దీన్ని కొనుగోలు చేయవచ్చు. లేదా వాహనదారులు ఉచితంగానే NHAI ఫాస్ట్ ట్యాగ్ పొందవచ్చు. అన్ని జాతీయ రహదారి టోల్ ప్లాజాలు, ప్రాంతీయ రవాణా కార్యాలయాలు, సాధారణ సేవా కేంద్రాలు, రవాణా కేంద్రాలు, పెట్రోల్ పంపుల వద్ద NHAI ఫాస్ట్ ట్యాగ్లను కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, యాక్సిస్, ఎస్‌బిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, సిటీ యూనియన్ బ్యాంక్ వంటి బ్యాంకుల వెబ్‌సైట్ల నుంచి కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు. ఫాస్ట్‌ట్యాగ్ కోసం MyFASTag యాప్, లేదా www.ihmcl.com ని సందర్శించండి. లేదా 1033 హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయవచ్చు.

ఫాస్ట్‌ట్యాగ్ కొనుగోలుకు కావాల్సిన డాక్యుమెంట్స్

మీరు ఫాస్ట్ ట్యాగ్ కొనుగోలు చేయడానికి మీ వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్‌సి), వాహన యజమాని పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్, అలాగే యజమాని ఐడి, అడ్రస్ ప్రూఫ్ (ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ లేదా ఓటరు గుర్తింపు కార్డు) వంటివి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలా?

ఫాస్ట్‌ట్యాగ్ కొనుగోలుకు వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ .200 చెల్లించాల్సి ఉంటుంది. దీని కొనుగోలు తర్వాత, మీరు మీ అవసరానికి అనుగుణంగా ఫాస్ట్‌టాగ్‌ను రీఛార్జ్ చేయాలి లేదా టాప్-అప్ చేయాలి. మీకు ఎన్ని ఫోర్ వీలర్ వాహనాలు ఉంటే అన్ని ఫాస్ట్‌ట్యాగ్ అవసరం. ఈ ఫాస్ట్ ట్యాగ్ ఐదేళ్ళ వరకు చెల్లుబాటు అవుతుంది.
ఫాస్ట్‌టాగ్‌ స్టిక్కర్ను ఎక్కడ అంటించాలి?

ఫాస్ట్‌టాగ్‌ స్టిక్కర్ను మీ కారు ముందు భాగంలో ఉండే అద్దానికి లోపలి నుండి అంటించాలి. ఫాస్ట్ ట్యాగ్‌ను తొలగించడానికి లేదా దాన్ని మరలా అంటించడానికి ప్రయత్నించవద్దు.

ఫాస్ట్‌ట్యాగ్‌ను రీఛార్జ్ చేయడం ఎలా?

వాహన యజమానులు తమ ఫాస్ట్ ట్యాగ్లను ఆన్‌లైన్‌లో రీఛార్జ్ చేసుకోవాలి. సాధారణ సేవా కేంద్రాలు, పెట్రోల్ పంపులు, బ్యాంక్ శాఖల్లో ట్యాగ్‌లు అందుబాటులో ఉంటాయి. అయితే, వినియోగదారులు తమ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెఫ్ట్, ఆర్‌టిజిఎస్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో వీటిని రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇది అమెజాన్, పేటీఎం, స్నాప్‌డీల్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఫాస్ట్‌ట్యాగ్స్ లభిస్తాయి. వీటిలతో పాటు మొత్తం 23 బ్యాంకుల ద్వారా ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ చేసుకోవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి పేజాప్ యాప్, ఎస్‌బిఐ యోనో యాప్ వంటి అన్ని బ్యాంకింగ్ యాప్‌లలో ఈ ఆప్షన్ అందుబాటులో ఉంది. మీరు మీ బ్యాంక్ ఖాతాను మీ ఫాస్ట్ ట్యాగ్ ఖాతాకు నేరుగా లింక్ చేయవచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా రీఛార్జ్ చేయడానికి, మీరు మీ వాహన నంబర్‌ను, చెల్లింపుదారుల వివరాలను నమోదు చేయాలి. అయితే, ఆన్‌లైన్‌లో రీఛార్జ్ చేయడానికి అన్ని బ్యాంకులు అదనపు రుసుమును వసూలు చేస్తాయని గమనించాలి.

గూగుల్ పేతో ఇలా రీఛార్జ్ చేయండి

మీ మొబైల్లోని గూగుల్ పే యాప్‌లోకి వెళ్లి మీ బ్యాంక్‌ ఖాతాను మీ ఫాస్ట్ ట్యాగ్ ఖాతాకు లింక్ చేసి, పేమెంట్పై క్లిక్ చేయండి. ఆపై మీ FASTag జారీచేసే బ్యాంకును ఎంచుకోండి. బ్యాంక్ పేరు, మీ ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్ ఎడమ వైపున ఉంటుందని గమనించండి. ఆ పేజీ తెరిచిన తర్వాత, స్టార్ట్పై క్లిక్ చేసి, మీ వాహన నంబర్‌ను ఫాస్ట్ ట్యాగ్ ఖాతా నంబర్‌ను లింక్ చేయండి. ఒక్కసారి లింక్ చేసిన తర్వాత, మీ ఖాతాను రీఛార్జ్ చేయడానికి క్రమం తప్పకుండా Google Pay ని ఉపయోగించవచ్చు. గూగుల్ పే లాగే ఫోన్‌పే, పేటీఎం యాప్ల ద్వారా కూడా ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ చేయవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :