Thursday, December 24, 2020

Bank Holidays 2021



Read also:

Bank Holidays 2021-కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. మరి 2021 లో బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉంటాయో తెలుసుకోండి.

ఎన్నో విభిన్నమైన జ్ఞాపకాలను మిగిల్చిన 2020 ముగుస్తోంది. 2021 వచ్చేస్తోంది. వచ్చే ఏడాది మీకు బ్యాంకుల్లో ఏవైనా ముఖ్యమైన పనులు ఉన్నాయా? మీరు ఎక్కువగా బ్యాంకుల్లో లావాదేవీలు జరుపుతుంటారా? అయితే మీరు తప్పనిసరిగా 2021 బ్యాంక్ హాలిడేస్ ఎప్పుడో తెలుసుకోవాలి. బ్యాంకులు ఎప్పుడు మూతపడతాయో తెలుసుకొని మీ లావాదేవీలు ప్లాన్ చేసుకోవడం మంచిది. ప్రతీ ఏటా ఏ నెలలో బ్యాంకులకు ఎన్ని సెలవులు ఉంటాయో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేస్తుంది. https://www.rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లింక్‌లో ఈ సెలవుల వివరాలు తెలుసుకోవచ్చు. రీజనల్ ఆఫీసుల వారీగా ఈ సెలవుల వివరాలను ఉంటాయి. 2021 హైదరాబాద్ రీజనల్‌లో బ్యాంకులకు ఎప్పుడు సెలవులు ఉంటాయో ఆర్‌బీఐ ప్రకటించింది. ఆ వివరాలు తెలుసుకోండి.

Bank Holidays 2021: వచ్చే ఏడాది బ్యాంకులకు సెలవుల వివరాలివే

  • జనవరి 14- మకర సంక్రాంతి, పొంగల్
  • జనవరి 26- రిపబ్లిక్ డే
  • మార్చి 11- మహా శివరాత్రి
  • మార్చి 29- హోలీ
  • ఏప్రిల్ 1- అకౌంట్స్ క్లోజింగ్ డే
  • ఏప్రిల్ 2- గుడ్ ఫ్రైడే
  • ఏప్రిల్ 5- బాబు జగ్జీవన్ రామ్ జయంతి
  • ఏప్రిల్ 13- ఉగాది
  • ఏప్రిల్ 14- అంబేద్కర్ జయంతి
  • ఏప్రిల్ 21- శ్రీరామనవమి
  • మే 1- మే డే
  • మే 14- రంజాన్
  • జూలై 21- బక్రీద్
  • ఆగస్ట్ 19- మొహర్రం
  • ఆగస్ట్ 31- శ్రీ కృష్ణాష్టమి
  • సెప్టెంబర్ 10- వినాయక చవితి
  • అక్టోబర్ 2- గాంధీ జయంతి
  • అక్టోబర్ 15- దుర్గాష్టమి, విజయదశమి
  • అక్టోబర్ 19- మిలాద్ ఉన్ నబీ
  • నవంబర్ 4- దీపావళి
  • నవంబర్ 19- గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి
  • డిసెంబర్ 25- క్రిస్మస్

ఈ జాబితా చూస్తే 2021 లో బ్యాంకులకు మొత్తం 22 పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. ఈ సెలవులు ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. స్థానిక పండుగలు, వేడుకలు, పర్వదినాల్లో సెలవులు ఉంటాయి. ఇవి కాకుండా ప్రతీ రెండో శనివారం, నాలుగో శనివారం, ప్రతీ ఆదివారం బ్యాంకులకు సెలవులే.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :