Monday, December 14, 2020

Confusion in web options



Read also:

అన్ని ఖాళీలకు పెట్టుకోవాలని విద్యాశాఖ జేడీ సూచన..

కొన్ని స్థానాలకే సైట్‌ క్లోజ్‌

స్పౌజ్‌పై స్పష్టత కరువు

ఆందోళనలో ఉపాధ్యాయులు

ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన వెబ్‌ ఆప్షన్ల విషయంలో గందరగోళం నెలకొంది. తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారు  విద్యాశాఖ ప్రదర్శించిన అన్ని ఖాళీలకు ఆప్షన్లు పెట్టుకోవాలని జాయిం ట్‌ డైరెక్టర్‌ ఆదేశించారు. ఆ ప్రకారం చూస్తే ఎస్‌జీటీలు ఒక్కొక్కరు కనీసం 1500 స్థానాలకు ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే 50 స్థానాలకు ఇవ్వగానే సైట్‌ క్లోజ్‌ అవుతోంది. వెబ్‌సైట్‌ సర్వర్‌ సామర్థ్యం పెంచనందునే ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో వందలాది ఆప్షన్లు వెబ్‌సైట్‌లో ఎలా నమోదు చేయాలో అర్థంకాక ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు.

టీచర్స్ ట్రాన్సఫర్స్ కి సంబదించిన పూర్తి సమాచారం

స్పౌజ్‌ సమస్య

స్సౌజ్‌ కేటగిరీలో అన్ని కేడర్లకు చెంది న 686 మంది బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇలాంటి వారు తమ భాగస్వామి పనిచేస్తున్న స్కూల్‌ లేదా కార్యాలయానికి సమీపంలోని పాఠశాలలకే ఆప్షన్లు ఇవ్వాలని, ఎక్కువ హెచ్‌ఆర్‌ఏ వస్తుందని దూరప్రాంతాలకు ఇస్తే చర్యలు తీసుకుంటామని పాఠశాల జేడీ హెచ్చరించారు.  అలాంటి వారు ఏ స్థానాలకు ఆప్షన్లు ఇవ్వాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. దీనిపై స్పష్టత కరువైంది.

ఎస్జీటీలకు అసలు ఇబ్బంది

వెబ్ కౌన్సెలింగ్ లో ఎస్జీటీల ఆసలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తప్పనిసరిగా స్థానచలనం కావాల్సిన వారు అన్ని ఖాళీలకు ఆప్షన్లు పెట్టుకోవాలని విద్యాశా జేడీ ఆదేశించారు. ఆ ప్రకారం ఒక్కొక్కరు 1500 స్తానాలకు ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంది. 50 స్థానాలకే సైట్ క్లోజ్ అవుతోంది. ఆషన్ల నమోదుకు ఇక రెండురోజులే గడువు ఉన్నందున టీచర్లు ఆందోళన చెందుతున్నారు 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :