Wednesday, December 23, 2020

పురపాలక ఉపాధ్యాయులకు 'కేంబ్రిడ్జి' శిక్షణ



Read also:

పురపాలక పాఠశాలల్లో సంస్కరణల ప్రాజెక్టు అమలుకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం సహకారంతో పురపాలక బడుల్లో ప్రవర్తన ప్రాజెక్టును గత ఏడాది చేపట్టగా ఇందులో మిగిలిన నిధులతో ఈ ఏడాదీ కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇందులో భాగంగా ఉపా ద్యాయులకు కేంట్రిడ్జ్ విశ్వవిద్యాలయం ద్వారా కమ్యూనికేషన్ నైపుణ్యా లపై శిక్షణ ఇప్పించడంతోపాటు ద్రువపత్రం ఇస్తారు. విద్యార్థుల కోసం కెరీర్ మార్గదర్శక కేంద్రాలు, డిజిటల్ ఈ-పాఠ్యాంశాల రూపకల్పనకు స్టూడియో ఏర్పాటు చేయనున్నారు. పురపాలక పాఠశాల విద్యార్థులకు అంతర్జాతీయ ఒలంపియాడను నిర్వహించనున్నారు. విద్యార్థుల అభ్యాస ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు కెరీర్ మార్గదర్శక కేంద్రాల్లో అవసరమైన శిక్షణ, సహకారం అందిస్తారు. 1-10 తరగతులకు | అన్ని సబ్జెక్టుల్లోనూ వీడియో, ఆడియో, యానిమేషన్ కంటెంట్ ను రూపొం దిస్తారు. ఇందుకు విశాఖపట్నం, విజయవాడ, కర్నూలుల్లో మూడు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. వీటి కోసం రూ. 29.60కోట్లు, జీతాలు, ఇత రాత్ర ఖర్చులకు రూ. 6కోట్లు వెచ్చిస్తారు. ఇందుకోసం గతేడాది మిగిలిన నిధులను వినియోగించుకునేందుకు అనుమతించింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :