Wednesday, December 23, 2020

సీబీఎస్‌ఈ పరీక్షలు ఫిబ్రవరి తర్వాతే



Read also:

రద్దుచేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు

అన్ని జాగ్రత్తలతో ఆఫ్‌లైన్‌లోనే నిర్వహిస్తాం

కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ వెల్లడి

దగ్గరి కాలేజీల్లోనే పరీక్షలు

ఇంజనీరింగ్‌, ఫార్మసీ విద్యార్థులకు వెసులుబాటు

ఈ ఏడాది కేంద్ర, రాష్ట్రాల సిలబ్‌సలో 30శాతం కోత

ఏటా జనవరి, ఫిబ్రవరిలో నిర్వహించే సీబీఎ్‌సఈ 10, 12తరగతుల పరీక్షలను కరోనా నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ తెలిపా రు. తదుపరి తేదీలను ఫిబ్రవరి తర్వాత వెల్లడిస్తామన్నారు. విద్యావ్యవస్థలో తీసుకోవాల్సిన చర్యల గురించి మంత్రి మంగళవారం ట్విటర్‌ ద్వారా ఉపాధ్యాయుల సలహాలు కోరారు. కరోనా నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరంలో అన్ని స్కూళ్లు మూసివేసినందున సీబీఎ్‌సఈ 10, 12 తరగతుల వార్షిక పరీక్షలు రద్దుచేయాలని ఉపాధ్యాయులు మంత్రిని కోరారు. పరీక్షల రద్దు ఎట్టి పరిస్థితుల్లో కుదరదని మంత్రి అన్నారు. జేఈఈలో ఆప్షన్లు ఇచ్చినట్లే సీబీఎ్‌సఈ పరీక్షల్లోనూ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.

ఆన్‌లైన్‌లో పరీక్షలు అసాధ్యం

బోధన ఆన్‌లైన్‌లో జరిగినందున పరీక్షలు సైతం ఈ విధానంలోనే నిర్వహించాలన్న ఉపాధ్యాయుల సూచనను మంత్రి తిరస్కరించారు. ఆన్‌లైన్‌ పరీక్షలు సాధ్యం కాదన్నారు. ఏటా నిర్వహిస్తున్నట్టుగానే ఈసారి కూడా పరీక్షలుంటాయని స్పష్టం చేశారు. ఈసారి సీబీఎ్‌సఈలో 30ు సిల బ్‌సను కుదించామన్నారు. అనేక దేశాలు ఈ ఏడాది విద్యాసంవత్సరాన్ని రద్దు చేయగా.. భారత్‌లో మాత్రం విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోలేదంటే ఈ ఘనత ఉపాధ్యాయులదే అని మంత్రి అన్నారు. 2,80,000 మాధ్యమిక పాఠశాలల్లో 6వ తరగతి నుంచి ఉపాధి ఆధారిత వృత్తి విద్యా కోర్సులు, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సులు ప్రవేశపెడతామన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :