Monday, November 30, 2020

New rules on Money Transfer



Read also:

New rules on Money Transfer

మీరు భారీగా లావాదేవీలు జరుపుతుంటారా? ఎక్కువగా మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తుంటారా? రేపటి నుంచి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. ఈ రూల్స్ మీకు ఎంత ఉపయోగపడతాయో తెలుసుకోండి.

1. మనీ ట్రాన్స్‌ఫర్ చేసేవారికి గుడ్ న్యూస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్-RTGS సేవల్ని కస్టమర్లకు 24 గంటలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. డిసెంబర్ నుంచి ఆర్‌టీజీఎస్ పేమెంట్ సేవలు 24 గంటలు ఉపయోగించుకోవచ్చు.

2. ఆర్‌బీఐ మానెటరీ పాలసీ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. పేమెంట్స్ వేగంగా జరిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

3. ప్రస్తుతం ఆర్‌టీజీఎస్ సేవలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే అందుబాటులో ఉన్నాయి. అంతకుముందు ఆర్‌టీజీఎస్ పేమెంట్ సర్వీస్ ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యేది. కానీ కొద్ది రోజుల క్రితం ఓ గంట సమయాన్ని అదనంగా కేటాయించింది ఆర్‌బీఐ. ఆగస్ట్ 26 నుంచి ఉదయం 7 గంటలకే ఆర్‌టీజీఎస్ సేవలు మొదలయ్యాయి.

4. ఇక అంతకుముందు ఆర్‌టీజీఎస్ సేవలు సాయంత్రం 4.30 గంటలకే ముగిసేవి. ఈ సమయాన్ని కూడా గంటన్నర పొడిగించింది ఆర్‌బీఐ. దీంతో సాయంత్రం 6 గంటల వరకు ఆర్‌టీజీఎస్ పేమెంట్స్ జరుగుతున్నాయి. ఇంటర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ రాత్రి 7:45 గంటల వరకు జరుగుతాయి.

5. ప్రస్తుతం ఒక రోజులో 11 గంటలు మాత్రమే ఆర్‌టీజీఎస్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే సాయంత్రం గడువు ముగిసిందంటే పేమెంట్ చేయడానికి మరుసటి రోజు వరకు ఆగాల్సిన పరిస్థితి ఉంది. దీంతో లావాదేవీల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

6. పేమెంట్స్ చేసేందుకు కస్టమర్లకు మరింత వెసులుబాటు కల్పించేందుకు 24 గంటలు ఆర్‌టీజీఎస్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆర్‌బీఐ తాజాగా నిర్ణయించింది. డిసెంబర్ నుంచి 24 గంటలూ ఆర్‌టీజీఎస్ సేవల్ని పొందొచ్చు.

7. సాధారణంగా ఎవరికైనా డబ్బుల్ని అకౌంట్ ద్వారా పంపడానికి నాలుగు పద్ధతులుంటాయి. అందులో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్-UPI, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్-NEFT, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్-RTGS, ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్-IMPS ద్వారా డబ్బులు పంపొచ్చు.

8. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్-UPI డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడానికి లిమిట్ ఉంటుంది. నెఫ్ట్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తే సెటిల్మెంట్ పద్ధతిలో అవతలివాళ్ల అకౌంట్‌లోకి వెళ్తాయి. అది కూడా బ్యాంకు పనిచేసే వేళల్లో మాత్రమే డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవుతాయి.

9. ఐఎంపీఎస్ ద్వారా వెంటనే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఇందుకోసం కొంత ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక భారీ మొత్తంలో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేందుకు రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్-RTGS ఉపయోగపడుతుంది. ఆర్‌టీజీఎస్ ద్వారా రూ.2 లక్షల నుంచి ఎంతైనా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :