Monday, November 30, 2020

Nokia Laptops will release soon in india



Read also:

Nokia Laptops will release soon in india

ఫీచర్‌ ఫోన్ల విభాగంలో టాప్ కంపెనీగా పేరొందిన నోకియా సంస్థ నుంచి ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు రానున్నాయి. నోకియా బ్రాండ్‌తో హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ త్వరలో భారతదేశంలో కొత్త సిరీస్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేయనుంది. వీటిని టోంగ్‌ఫాంగ్ సంస్థ చైనాలో తయారుచేయనుంది.

ఒకప్పుడు ఫీచర్‌ ఫోన్ల విభాగంలో టాప్ కంపెనీగా పేరొందిన నోకియా సంస్థ నుంచి ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు రానున్నాయి. నోకియా బ్రాండ్‌తో హెచ్‌ఎండి గ్లోబల్ (HMD Global) సంస్థ త్వరలో భారతదేశంలో కొత్త సిరీస్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సంస్థ తాజాగా తొమ్మిది ల్యాప్‌టాప్ మోడళ్లకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) గుర్తింపు కోసం అప్లికేషన్ పెట్టుకుంది. దీంతో నోకియా ల్యాప్‌టాప్‌లు మన దేశంలో అధికారికంగా విడుదల కానున్నాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. భారత్‌లో ఫీచర్ ఫోన్లు, స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో నోకియాకు మంచి పేరుంది. ఈ సంస్థ గతంలో కూడా ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లను తయారు చేసింది. తాజాగా ఈ కొత్త ప్రొడక్ట్స్‌తో హెచ్‌ఎండి గ్లోబల్ ల్యాప్‌టాప్ వ్యాపారాన్ని భారత్‌లో పునరుద్ధరించనుంది.

ఏయే మోడళ్లు?

మొత్తం తొమ్మిది ల్యాప్‌టాప్‌ మోడళ్లను నోకియా అందుబాటులోకి తీసుకురానుంది. ఈ జాబితాలో NKi510UL82S, NKi510UL85S, NKi510UL165S, NKi510UL810S, NKi510UL1610S, NKi310UL41S, NKi310UL42S, NKi310UL82S, NKi310UL85S సిరీస్ మోడళ్లు ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లకు సర్టిఫికేషన్ ఇచ్చినట్టు BIS వెబ్‌సైట్లో కనిపిస్తోంది. కానీ దీనికి సంబంధించిన అధికారిక సమాచాన్ని నోకియా వెల్లడించలేదు. తర్వలోనే ఈ మోడళ్లు మార్కెట్లోకి రానున్నాయని నోకియామోబ్ వెబ్‌సైట్ తెలిపింది.

ప్రత్యేకతలేంటి?

మోడల్ నంబర్లలో మొదటి రెండు అక్షరాలైన NKలు- నోకియా బ్రాండ్‌ను సూచిస్తున్నాయి. తరువాతి అక్షరాలైన i5, i3లు ప్రాసెసర్‌ను, ‘10’ నంబర్ మైక్రోసాఫ్ట్ విండోస్ 10 OSను సూచిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే హెచ్‌ఎండి గ్లోబల్ i5 ప్రాసెసర్‌తో ఐదు ల్యాప్‌టాప్ మోడళ్లను, i3 చిప్‌సెట్‌తో నాలుగు మోడళ్లను రూపొందించనట్లు వినియోగదారులు అంచనా వేస్తున్నారు.

లాంచింగ్ ఎప్పుడు?

ఈ ల్యాప్‌టాప్‌లను టోంగ్‌ఫాంగ్ సంస్థ చైనాలో తయారుచేయనుంది. నోకియా ఈ ల్యాప్‌టాప్‌లను భారతదేశంలో విడుదల చేయడంపై అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ వీటిని మన దేశంలో లాంచ్ చేస్తే, అవి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉండవచ్చు. భారత్‌లో నోకియా టెలివిజన్, ఇతర స్ట్రీమింగ్ డివైజ్‌లకు ఫ్లిప్‌కార్ట్ అధికారిక బ్రాండ్ లైసెన్స్‌దారుడిగా ఉంది

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :