Monday, November 9, 2020

వంటల కోసం ఏయే నూనెలను ఉపయోగించాలి ఏవి ఉత్తమమైనవి అంటే



Read also:

మార్కెట్‌లో మనకు ప్రస్తుతం అనేక రకాల వంట నూనెలు అందుబాటులో ఉన్నాయి. ఆయిల్ తయారీ కంపెనీలు ఇచ్చే యాడ్స్ కు కొందరు ఆకర్షితులై వంట నూనెలను కొంటారు. కొందరు తక్కువ ధరలకు వచ్చే నూనెలను కొనుగోలు చేస్తారు. అయితే నిజానికి మనకు అసలు వంటలకు ఏ నూనె అయితే మంచిది ? ఏ నూనెలో ఎక్కువ పోషకాలు ఉంటాయి ? ఏ నూనె మనకు ఆరోగ్యకరం ? అంటే

నువ్వుల నూనె

నువ్వుల నూనె మన శరీరానికి ఆరోగ్యకరం. దీన్ని నువ్వుల నుంచి తీస్తారు. ఇందులో కార్బొహైడ్రేట్లు అస్సలు ఉండవు. విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. దీంతో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే అల్జీమర్స్‌, క్యాన్సర్‌, కంటిలో శుక్లాలు రాకుండా ఉంటాయి.

ఈ నూనె ఎముకలను దృఢంగా మారుస్తుంది. దీన్ని అనేక ఆహారాల్లో వేసి తీసుకోవచ్చు.

కొబ్బరి నూనె

కొబ్బరినూనెను తీసుకుంటే గుండెకు ఎంతగానో మేలు జరుగుతుంది. ఇందులోనూ కార్బొహైడ్రేట్లు ఉండవు. పైగా పోషకాలు మిక్కిలిగా ఉంటాయి. అవి మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. కొబ్బరినూనెలో ఉండే లారిక్ యాసిడ్ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. మన శరీరం మెగ్నిషియం, విటమిన్ ఇ, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలను శోషించుకునేందుకు కొబ్బరినూనె ఎంతగానో ఉపయోగపడుతుంది.

వెన్న.

వెన్నను కూడా నిత్యం వంట నూనెలకు బదులుగా తీసుకోవచ్చు. దీంట్లో ఉండే పోషకాలు మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలో కణజాలం సరిగ్గా పనిచేస్తుంది. వెన్నలో ఉండే విటమిన్ కె రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. దీంతో హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి. అలాగే విటమిన్ ఇ, ఎలు చర్మం, కళ్లకు ఎంతగానో మేలు చేస్తాయి. కంటి చూపు మెరుగు పడుతుంది. శిరోజాలు సంరక్షింపబడతాయి.

ఆలివ్ ఆయిల్‌

ఆలివ్ ఆయిల్‌లో కొలెస్ట్రాల్ తక్కువ. కార్బొహైడ్రేట్లు ఉండవు. కానీ క్యాలరీలు అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ నూనెను పరిమితంగా తీసుకోవాలి. అలా తీసుకుంటేనే మేలు జరుగుతుంది. ఈ నూనె డయాబెటిస్‌, గుండె జబ్బులు, బీపీ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది. ఈ నూనెలో విటమిన్ కె, ఫాస్ఫరస్‌, విటమిన్ ఇ, మెగ్నిషియం, పొటాషియం, జింక్ లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

పొద్దుతిరుగుడు విత్తనాల నూనె

సన్ ఫ్లవర్ ఆయిల్‌లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. అందువల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ నూనెలో ఉండే ఓలియిక్ యాసిడ్ గుండె జబ్బులు రాకుండా చూస్తుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :