Monday, November 9, 2020

how to send money in whatsApp Pay in telugu



Read also:

వాట్సప్ పే చేయాలంటే మీ మొబైల్లో అప్ డేట్ వెర్షన్ ఉండాలి. దేశంలోని 160 బ్యాంకుల్లో ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌కు యూపీఐ చెల్లింపులను వాట్సప్ పే ద్వారా చేయవచ్చు.

ప్రస్తుతం భారత్‌లో డిజిటల్ పేమెంట్స్ కొత్త పుంతలు తొక్కనుంది. ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు వాట్సప్ పే (WhatsApp Pay) అందుబాటులోకి వచ్చింది. వాట్సప్ పే ద్వారా యూపీఐ సేవలకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI అనుమతి ఇచ్చింది. దీంతో వాట్సాప్ పే ద్వారా చెల్లింపులు చేసేందుకు రూట్ క్లియర్ అయింది. వాట్సప్ పే చేయాలంటే మీ మొబైల్లో అప్ డేట్ వెర్షన్ ఉండాలి. దేశంలోని 160 బ్యాంకుల్లో ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌కు యూపీఐ చెల్లింపులను వాట్సప్ పే ద్వారా చేయవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గూగుల్ పే (GPay), ఫోన్ పే (PhonePe), పేటీఎం (Paytm)కు వాట్సాప్ పే పోటీ ఇవ్వనుంది. తొలిదశలో 20 మిలియన్ల వాట్సాప్ యూజర్లకు WhatsApp Pay సేవలు అందుబాటులోకి వస్తాయి. ఆ తర్వాత దశలవారీగా యూజర్ల సంఖ్యను పెంచుతుంది. మొత్తం యూపీఐ చెల్లింపుల్లో వాట్సాప్ వాటాను 30 శాతానికి మించకూడదని ఎన్‌పీసీఐ ఆంక్షలు విధించింది. భారత్‌లో వాట్సాప్‌కు 400 మిలియన్ల యూజర్లు ఉన్నారు.

దేశంలో 160 బ్యాంకులతో వాట్సాప్ ఒప్పందం చేసుకుంది. కాబట్టి, మీకు అకౌంట్ ఉన్న బ్యాంకు కూడా ఇందులో ఉండడానికి ఆస్కారం ఉంది. ప్రధాన బ్యాంకులైన యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, అలహాబాద్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, ఆర్బీఎల్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, యెస్ బ్యాంక్, ఇంకా ఇతర బ్యాంకులు ఉన్నాయి. వాట్సాప్ పే చేయాలనుకునే వారు మొదట వాట్సాప్ అప్ డేట్ వెర్షన్ కలిగి ఉండాలి. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్‌ను వాట్సాప్‌తో లింక్ చేయాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు బ్యాంక్‌లో ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో, ఆ నెంబర్‌తోనే వాట్సాప్ ఉండాలి. యూపీఐ వెరిఫికేషన్ కోసం బ్యాంక్ నుంచి ఆటో డిటెక్ట్ ఎస్ఎంఎస్ వస్తుంది.

వాట్సాప్ పే, యూపీఐ సెటప్ పూర్తయిన తర్వాత వాట్సాప్ చాట్ విండో నుంచే మీరు పేమెంట్స్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎటాచ్‌మెంట్ పిన్ మీద క్లిక్ చేయండి. ఐఫోన్ అయితే + సింబల్ ఉంటుంది. అక్కడ మీకు పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. వాట్సాప్ పే ద్వారా మీరు చెల్లించడమే కాదు. మీరు ఇతరుల నుంచి రిసీవ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఎవరి వద్ద నుంచి డబ్బులు పొందాలనుకుంటున్నారో వారికి రిక్వెస్ట్ నోటిఫిషన్ పంపితే, వారు డబ్బులు పే చేస్తారు.

వాట్సాప్ పే కోసం కూడా పేటీఎం తరహాలో కేవైసీ పూర్తి చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ బ్యాంక్‌లో ఇచ్చిన మొబైల్ నెంబర్‌నే వాట్సాప్ కోసం వినియోగిస్తున్నారు కాబట్టి కొత్తగా కేవైసీ చేయాల్సిన పనిలేదు.

వాట్సప్ పేమెంట్స్ సేవల్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI 2018 ఫిబ్రవరిలో నిలిపివేసిన సంగతి తెలిసిందే. చట్టపరమైన, నియంత్రణ అడ్డంకుల కారణంగా అనుమతులకు రెండేళ్ల గడువు పట్టింది. ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :