Saturday, November 21, 2020

23 నుంచి విద్యా కానుక వారోత్సవాలు



Read also:

జగనన్న విద్యా కానుక వారోత్సవాలు ఈ నెల 23 నుంచి 28 వరకు నిర్వహించనున్నామని డీఈవో వీఎస్‌ సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు కిట్ల పంపిణీ జరిగిందన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో లోపాలు సవరించి పాఠశాలలు తెరిచే నాటికే కానుకలు ఇవ్వడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. వారం రోజుల్లో ఏమి చేయాలనేది రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్‌ను పాఠశాలలకు పంపించామని పేర్కొన్నారు. పిల్లలు యూనిఫాం కుట్టించుకునేలా చూడటం, బూట్లు, సాక్స్‌లు వేసుకునే విధానం, ఉతుక్కునే పద్ధతి తెలియజేయడం, పాఠ్యపుస్తకాలకు అట్టలు వేసుకునేలా సూచించడం, బ్యాగులు వాడే విధానం తదితర విషయాలపై వారోత్సవాలు జరపాలని సూచించామన్నారు. ఏకరూప దుస్తులు కుట్టిన వెంటనే బయోమెట్రిక్‌ ద్వారా క్లియరెన్స్‌ ఇస్తే కుట్టు కూలి జమ చేస్తామని వెల్లడించారు. 1 నుంచి 8 తరగతుల వారికి ఒక్కొక్క జతకు రూ.40 చొప్పున మూడు జతలకు రూ.120, 9,10 తరగతుల వారికి రూ.80 చొప్పున మూడు జతలకు రూ.240 నగదును తల్లుల ఖాతాల్లో వేస్తామని వివరించారు. బూట్ల సైజుల విషయంలో మార్పులు ఉంటే పాఠశాల స్థాయిలో సరిచేయాలని, ఎంఈవోలు, ఉప విద్యాశాఖ అధికారులు, సెక్టోరల్‌ అధికారులు పర్యవేక్షించాలని కోరారు.

23వ తేది: విద్యార్థులకు, తల్లిదండ్రులకు 'జగనన్న విద్యాకానుక' గురించి అవగాహన కల్పించడం. ప్రతి విద్యార్థికి స్టూడెంట్ కిట్ అందిందా లేదా పరిశీ లించడం. బయోమెట్రిక్ అథంటికేషన్ తనిఖీ

24వ తేది: విద్యార్థులు యూనిఫాం కుట్టించుకున్నారో లేదో పరిశీలించడం. కుట్టు కూలి ఖర్చులు తల్లుల ఖాతాలకు జమచేస్తున్న విషయాన్ని తెలపడం. దుస్తులు కుట్టించుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం

25వ తేదీ: విద్యార్థులు బూట్లు వేసుకునే విధానం, సా క్సులు ఉతుక్కోవడం వంటి వాటిపై అవగాహన కల్పిం చడం. బూట్ల కొలతల్లో ఇబ్బందులుంటే సరిదిద్దడం

26వ తేది: పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ పుస్తకాలకు అట్టలు వేసుకోవడం, పుస్తకాలను ఉపయో గించుకోవడంపై అవగాహన కల్పించడం

27వ తేది: బ్యాగులు వాడే విధానం, పాఠశాల బ్యాగు బరువు తగ్గించే విధానం గురించి అవగాహన కల్పించడం. బ్యాగుల విషయంలో ఏవైనా సూచనలుంటే అధికారుల దృష్టికి తీసుకురావడం

28వ తేబి: జగనన్న విద్యాకానుక కిట్లో అన్ని వస్తు వులు అందాయా లేదా తెలుసుకోవడం, బయోమెట్రిక్ సరిగా ఉందో లేదో పరిశీలించడం

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :