Saturday, October 24, 2020

AP EAMCET 2020 counseling



Read also:

AP EAMCET 2020 counseling

ఏపీలో ఎంసెట్ కౌన్సెలింగ్ కోసం ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం రాష్ట్ర మొత్తం 25 హెల్ప్‌లైన్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. పాడేరులో తొలిసారిగా గిరిజన విద్యార్ధుల కోసం హెల్ప్‌లైన్‌ ను ఏర్పాటు చేశారు.

AP EAMCET 2020 Counseling Process

ఏపీలో ఎంసెట్ కౌన్సెలింగ్ ఈ రోజు ప్రారంభమైంది. ఇంజినీరింగ్ విభాగానికి అధికారులు వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెబ్ కౌన్సిలింగ్ సాగింది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం రాష్ట్ర మొత్తం 25 హెల్ప్‌లైన్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. పాడేరులో తొలిసారిగా గిరిజన విద్యార్ధుల కోసం హెల్ప్‌లైన్‌ ను ఏర్పాటు చేశారు. ఈ రోజు ఒకటో ర్యాంక్ నుంచి 20వేల వరకు వెబ్ కౌన్సిలింగ్ సాగింది. 24న 20,001 ర్యాంక్ నుంచి 50వేల వ‌ర‌కు, 25న 50,001 ర్యాంక్ నుంచి 80వేల వరకు, 26న 80,001 ర్యాంక్ నుంచి 1.10లక్షల వరకు

27న 1,10,001 నుంచి చివరి ర్యాంక్‌ వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.

ఓసీ, బీసీ అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.1,200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600 నిర్ణయించారు. కరోనా నేపథ్యంలో ఇంటి నుంచే సర్టిఫికేట్ల వెరిఫికేషన్లో పాల్గొనే అవకాశాన్ని అధికారులు కల్పించారు. దీంతో ఆన్లైన్లోనే సర్టిఫికేట్లను పరిశీలించనున్నారు. సర్టిఫికేషన్ల వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులకు ఆప్షన్లను ఇచ్చే అవకాశం కల్పిస్తారు. విద్యార్థులు ఏదైనా సందేహాలుంటే 8106876345, 8106575234, 7995865456, 7995681678 ఈ హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు మూతబడ్డాయి. అనేక పరీక్షలు వాయిదా పడ్డాయి. దీంతో అనేక కోర్సుల్లో ప్రవేశాలు ఆగిపోయాయి. అయితే గత కొన్ని రోజులుగా అనేక రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ఫలితాలను సైతం విడుదల చేస్తున్నారు. త్వరగా ప్రవేశాలను పూర్తి చేసి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానాల్లో తరగతులు నిర్వహించడానికి ఆయా యూనివర్సిటీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) కీలక ప్రకటన చేసింది.

ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం, సంబంధిత యూజీ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు డిసెంబర్‌ 1లోగా తరగతులను ప్రారంభించాలని ఆయా యూనివర్సిటీలను ఆదేశించింది. ఈ మేరకు తాజాగా ఏఐసీటీఈ రివైజ్డ్‌ షెడ్యూలును విడుదల చేసింది. గతంలో నవంబర్‌ 1 నుంచే తరగతులను ప్రారంభించేలా అకడమిక్‌ షెడ్యూలును ప్రకటించారు. అయితే ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఐఐటీ వంటి జాతీయస్థాయి విద్యా సంస్థల్లో ఇంకా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో ఏఐసీటీఈ అకడమిక్‌ షెడ్యూలును సవరిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :