Saturday, October 17, 2020

AP EAMCET Counseling process



Read also:

AP EAMCET Counseling process

ఎంసెట్ అర్హత సాధించిన ఎంపీసీ స్టీం విద్యార్ధులు ప్రాసెసింగ్ రుసుము చెల్లించి కౌన్సెలింగ్ లో పాల్గొనాలి. ఒసి, బీసీ అభ్యర్ధులకు 1200 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు 600 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్ లో పాల్గోవాలనుకునే అభ్యర్ధులు https://apeamcet.nic.in/ ద్వారా 23 వ తేదీ నుంచి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించే అవకాశం కలుగుతుంది.
కౌన్సెలింగ్ ప్రక్రియ విధానం
  • ఆన్లైన్ లో ఫీజు చెల్లించి ఆ రశీదు ప్రింట్ అవుట్ తీసుకోవాలి
  • ప్రాసెసింగ్ ఫీజు కట్ట్టిన అభ్యర్ధుల మొబైల్ నెంబర్ కు రిజిస్ట్రేషన్ నెంబర్.. లాగిన్ ఐడీలు మెసేజ్ వస్తుంది.
  • ఈ మెసేజ్ వస్తే ఆన్లైన్ లో ప్రక్రియ పూర్తి అనినట్లు.
  • ఒకవేళ ఆన్లైన్ లో డాటా వెరిఫికేషన్ లో సమస్యలు వచ్చినట్టయితే ఫిజికల్ గా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఎక్కడ.. ఏ సమయంలో హాజరు కావాలో తెలుపుతూ మెసేజ్ వస్తుంది.
  • సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి అయిన తరువాత లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ క్రియేట్ చేసుకుని ఆప్షన్లను నమోదు చేసుకోవాలి.
  • ప్రస్తుతం ఈ నెల 23 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు మాత్రమే అవకాశం కల్పించారు.
  • ఈ నెల 23 నుంచి 27 వరకూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
  • వెబ్ ఆప్షన్ల నమోదు తేదీలను తరువాత ప్రకటిస్తారు.
  • దివ్యాంగులు, స్పోర్ట్స్, గేమ్స్, ఎన్‌సీసీ, ఆంగ్లో ఇండియన్‌ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో ఉదయం 9 గంటల నుంచి నిర్వహిస్తారు.
  • సీఏపీ (చిల్డ్రన్‌ ఆఫ్‌ ఆర్మ్‌డ్‌ పర్సనల్‌) అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లోని హెల్ప్‌లైన్‌ కేంద్రాలకు వెళ్లవచ్చు.
  • నోటిఫికేషన్‌లో ఏ ర్యాంకుల వారికి ఏ తేదీ సర్టిఫికెట్‌ వెరికేషన్‌ ఉంటుందనే విషయం కూడా స్పష్టంగా ఇచ్చారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :