Tuesday, September 29, 2020

Schools reopen at nov-2



Read also:

న‌వంబ‌ర్ 2న స్కూళ్ల పునఃప్రారంభం

క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాలు

ప‌్ర‌స్తుత ప‌రిస్థితుల దృష్ట్యా ఏపీలో స్కూళ్ల పునః ప్రారంభం వాయిదా ప‌డింది. అక్టోబ‌ర్ 5న స్కూళ్లు ప్రారంభించాల‌ని ఇదివ‌ర‌కే నిర్ణ‌యం తీసుకోగా, ఆ నిర్ణ‌యాన్ని వాయిదా వేస్తూ న‌వంబ‌ర్ 2న పాఠ‌శాల‌లు పునఃప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఇవాళ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ క‌లెక్ట‌ర్ల‌తో నాడు-నేడు, స్పంద‌న కార్య‌క్ర‌మాల‌పై స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా స్కూళ్ల పునఃప్రారంభంపై చ‌ర్చించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల దృష్ట్యా వాయిదా వేయాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. అలాగే అక్టోబ‌ర్ 5న జ‌గ‌న‌న్న విద్యా కానుక అందించాల‌ని, అక్టోబ‌ర్‌లోగా విద్యార్థులు యూనిఫాం కుట్టించుకొని స్కూళ్ల‌కు సిద్ధ‌మ‌వుతార‌ని సూచించారు.


1. మన బడి నాడు నేడు " కార్యక్రమం క్రింద పెండింగ్ లో ఉన్న చెల్లింపులు.అక్టోబర్ మొదటి వారం లోపల చెల్లిస్తామని సంబంధిత ఏర్పాట్లు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి గారు‌ ప్రకటించారు.

2. పాఠశాలలు రీ ఒపెనింగ్ ని కరోనా కోవిడ్19 నేపథ్యం లో  అక్టోబర్ 5 నుండి నవంబర్ 2 కి వాయిదా వేయాలని సూత్రప్రాయంగా‌ నిర్ణయం జరిగింది.

3. జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ ని అక్టోబర్ 5 న చేపట్టాలని.నవంబర్ 2 వ తేదీ లోపల విద్యార్థులు కొత్త బట్టలు కుట్టించుకొని‌ స్కూల్స్ కి వెళ్ళడానికి తయారు అవుతారని 

కుదిరితే ముఖ్యమంత్రి గారు  తానే స్వయంగా ఏదైనా జిల్లాలో పాల్గొంటానని తెలిపారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :