Tuesday, September 29, 2020

New Traffic rules and guidelines



Read also:

మొబైల్ చూస్తూ కారు డ్రైవ్ చేస్తున్నారా. మీరు ఇది తప్పక తెలుసుకోవాల్సిందే

డ్రైవింగ్ ఎలా చెయ్యకూడదు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏం చెయ్యకూడదు అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ జారీ చేసింది. అవేంటో తెలుసుకుంటే. ట్రాఫిక్ పోలీసుల ఫైన్ల నుంచి తప్పించుకోవచ్చు.

కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాక. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడే అంశంపై ఉన్న రూల్స్‌లో కొన్ని మార్పులు చేసింది. వాటిలో రూల్ 7 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రాబోతోంది. అదేంటో మనం తెలుసుకుందాం.

ఇకపై డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడొచ్చు. అన్ని సందర్భాల్లో కాదు. ఒకే ఒక్క అంశంలో మాత్రమే. అదే నేవిగేషన్ రూట్స్ విషయంలో. సింపుల్‌గా చెప్పాలంటే. మనం కార్లు, బైకులపై వెళ్తూ. మొబైల్‌లో గూగుల్ మ్యాప్ చూస్తూ డ్రైవ్ చేస్తాం కదా. ఇప్పటివరకూ అలా డ్రైవ్ చేయడం నేరం. అక్టోబర్ 1 నుంచి అది నేరం కాదు. అలా చేయవచ్చు అని కొత్తగా మార్పులు చేశారు. ఇన్నాళ్లూ అది నేరమైనా మనం జనరల్‌గా అది చేస్తున్నాం. ట్రాఫిక్ పోలీసులు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే కాలానుగుణంగా వచ్చే మార్పుల్ని ఎవరైనా స్వాగతించాల్సిందే కదా. ఇకపై మొబైల్‌లో జీపీఎస్ ట్రాకింగ్ చూస్తూ. డ్రైవ్ చేసుకోవచ్చు. అదే సమయంలో డ్రైవర్ జాగ్రత్తగా వెళ్లాలన్నది మర్చిపోకూడదు.

పైన చెప్పింది మీకు క్లారిటీగా అర్థమైంది కదా. మళ్లీ చెబుతున్నా. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ వాడకూడదు. ఈ కండీషన్‌లో ఏ మార్పూ లేదు. అంటే మొబైల్ మాట్లాడుతూ డ్రైవ్ చెయ్యడం, ఇయర్ ఫోన్స్ తగిలించుకొని. పాటలు వింటూ డ్రైవ్ చెయ్యడం, కాల్స్ చెయ్యడం ఇవన్నీ నేరాలే. ఇందుకు రూ.1000 నుంచి రూ.5000 దాకా ఫైన్ కట్టాల్సి ఉంటుంది. పైగా ఇలాంటి డ్రైవింగ్ ప్రాణాలకే ప్రమాదం కూడా. తాజాగా అనుమతి ఇచ్చింది నేవిగేషన్ రూట్లను తెలుసుకోవడానికి మాత్రమే.

కేంద్ర రవాణా శాఖ. కొత్త రోడ్ రవాణా చట్టం తెచ్చింది. ఈ కొత్త చట్టం కింద. మనం వాహనంతోపాటూ. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ పేపర్, పొల్యూషన్ సర్టిఫికెట్ వంటివి వాహనంతోపాటూ తీసుకెళ్లాల్సిన పనిలేదు. అయితే. వీటిని మనం ముందుగానే. రవాణా శాఖ ఆన్‌లైన్ ఈ-పోర్టల్‌లో అప్‌లోడ్ చేసుకోవాలి. ఎక్కడైనా పోలీసులు ఆపితే. ఈ-పోర్టల్‌లో చూపించవచ్చు. ఇది ఎంతో సౌకర్యవంతమైన అంశం. చాలా కాలంగా ఇది అమల్లో ఉన్నా. ఇప్పటివరకూ పత్రాలు కూడా చూపించమని అడిగేవాళ్లు. ఇకపై అలా అడగరు. డైరెక్టుగా ఆన్‌లైన్‌లోనే చూస్తారు. ఆన్‌లైన్‌లో అప్ లోడ్ చేసుకోని వాళ్లు. వాటిని వెంట తీసుకెళ్తే మంచిదే.

కేంద్ర రవాణా శాఖ తెచ్చిన కొత్త ఈ-పోర్టల్‍‌లో. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఉంది. అందులో అన్ని వాహనాల వివరాలూ ఉంటాయి. అందువల్ల ట్రాఫిక్ పోలీసులు ఏదైనా వాహనాన్ని ఆపితే. దాని నెంబర్‌ని ఆ వెబ్‌సైట్‌లో ఎంటర్ చేస్తారు. అంతే. క్షణాల్లో దాని వివరాలు మొత్తం వచ్చేస్తాయి. తద్వారా అన్ని పత్రాలూ ఉన్నాయో లేదో తెలిసిపోతుంది. అలాగే. ఫైన్ వేయదలిస్తే. అందుకు సంబంధించిన ఈ-ఇన్వాయిస్ కూడా డ్రైవింగ్ చేస్తున్నవారి మొబైల్‌కి వస్తుంది. ఇందుకు ప్రత్యేక మొబైల్ ఫోన్ యాప్ కూడా తెచ్చారు. దీన్ని ట్రాఫిక్ పోలీసులు వాడుతారు. ఇలా ట్రాఫిక్ సిస్టమ్స్ అప్‌డేట్ అవుతున్నాయి. మనమూ అందుకు తగ్గట్టుగా ప్రిపేర్ అయిపోతే. సమస్యలు ఉండవు.

NO physical Documents Required

ఇంటి నుంచి బైక్ లేదా కారును బయటికి తీస్తున్నామంటే డాక్యుమెంట్స్ ఖచ్చితంగా తీసుకెళ్లాలి. ఇంతకుముందు ఫిజికల్ డాక్యుమెంట్లను మాత్రమే తీసుకెళ్లాల్సి ఉండేది. కానీ డిజి లాకర్ వంటి టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో కేవలం సాఫ్ట్ కాపీలను చూపిస్తే సరిపోతుంది. ఐతే కొందరు ట్రాఫిక్ పోలీస్ అధికారులు మాత్రం డిజిటల్ డాక్యుమెంట్స్ చూపించినప్పటికీ.. ఫిజికల్ డాక్యుమెంట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. అలాంటి సందర్భాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే మోటార్ వాహనాల చట్టం-1989 నియమ నిబంధనల్లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మార్పులు చేసింది. అక్టోబరు 1 నుంచి అవి అమల్లోకి రాబోతున్నాయి. అవేంటో ఇక్కడ చూడండి.

రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఏవరైనా ట్రాఫిక్ అధికారి వాహనాన్ని ఆపి.. వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ అడిగితే డిజిటల్ డాక్యుమెంట్స్ చూపిస్తే సరిపోతుంది. డిజిటల్ డాక్యుమెంట్లు కరెక్ట్‌గా ఉంటే ఫిజికల్ డాక్యుమెంట్లను సదరు అధికారులు అడగకూడదు. ఒకవేళ అతడు ఏదైనా నేరం చేసినప్పటికీ ఫిజికల్ డాక్యుమెంట్లు డిమాండ్ చేయకూడదు.ఎవరైనా వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్‌ను సంబంధిత ట్రాఫిక్ అధికారి రద్దు చేస్తే ఆ వివరాలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. ఆ రికార్డును ఎలక్ట్రానిక్‌ విధానంలో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. తద్వారా డ్రైవర్ ప్రవర్తన తీరుపై పర్యవేక్షణ ఉంటుంది.

రోడ్డుపై ఏదైనా వాహనాన్ని ఆపి వాహన పత్రాలు, డ్రైవర్ లైసెన్స్‌ను తనిఖీ చేస్తే.. ఆ వాహన వివరాలతో పాటు తేదీ, సమయాన్ని సంబంధిత అధికారి వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. తద్వారా వేరొక చోటకు వెళ్లినప్పుడు మళ్లీ ఇతర అధికారులు తనిఖీ చేసే అవసరం ఉండదు. అప్పుడు ట్రాఫిక్ సిబ్బంది సమయం వృథా కాదు. వాహనదారుడికీ ఇబ్బందులు తప్పుతాయి.

వాహనదారులు తమ వాహన పత్రాలనున కేంద్ర ప్రభుత్వ పోర్టల్ అయిన డిజి లాకర్ (Digi-locker) లేదా ఎం-పరివాహన్‌ (m-parivahan)లో నమోదు చేసుకోవచ్చు. వాటిని ఆన్‌లైన్‌లో సేవ్ చేసుకోవడం వల్ల ఫిజికల్ డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. రోడ్డుపై ఎవరైనా ట్రాఫిక్ అధికారులు ఆపి పత్రాలు అడితే.. ఆన్‌లైన్‌లో చూపిస్తే సరిపోతుంది.

వాహనాన్ని నడుపుతున్న సమయంలో కేవలం నేవిగేషన్ (రూట్ మ్యాప్) కోసమే మొబైల్ ఫోన్లను వినియోగించాల్సి ఉంటుంది. అది కూడా డ్రైవింగ్‌లో డ్రైవర్ ఏకాగ్రతను దెబ్బతీసే విధంగా ఉండకూడదు.

డ్రైవింగ్ సమయంలో చేతిలో ఉపయోగించే పరికరాలు, ఎలక్ట్రానిక్ రూపంలో వాహన పత్రాల పరిశీలనకు సంబంధించి Motor Vehicles (Driving) Regulations 2017లో కూడా పలు సవరణలు చేసినట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ వెల్లడించింది.

What is DIGI LOCKER

How to Register and Upload Documents into DIGI Locker

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :