Tuesday, September 29, 2020

Bank Holidays in October 2020



Read also:

Bank Holidays in October 2020

మీకు అక్టోబర్‌లో ముఖ్యమైన లావాదేవీలు ఉన్నాయా? బ్యాంకులో జరపాల్సిన ట్రాన్సాక్షన్స్ ఏవైనా ఉన్నాయా? ప్రతీ ఏడాది అక్టోబర్ వచ్చిందంటే పండుగల సీజన్ మొదలవుతుంది. మరి అక్టోబర్‌లో బ్యాంకులకు ఎప్పుడు సెలవులు ఉంటాయో తెలుసుకొని ట్రాన్సాక్షన్స్ ప్లాన్ చేసుకోవడం అవసరం. అక్టోబర్‌లో మొదలయ్యే పండుగల సందడి జనవరి వరకు ఉంటుంది. అక్టోబర్‌లో నవరాత్రి నుంచి జనవరిలో సంక్రాంతి వరకు ఫెస్టివల్ సీజనే. నవరాత్రి ఉత్సవాలు, దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి ఇలా వరుసగా పండుగలతో పబ్లిక్ హాలిడేస్ ఎక్కువగా వస్తాయి. కాబట్టి బ్యాంకులకు కూడా ఎక్కువగానే సెలవులు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్‌లో బ్యాంకులకు 8 రోజులు సెలవులు రానున్నాయి.


వీటిలో రెండో శనివారం, నాలుగో శనివారం, నాలుగు ఆదివారాలతో పాటు పండుగలు, ఇతర పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. బ్యాంకులకు పబ్లిక్ హాలిడేస్ వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉంటుంది. స్థానిక పండుగలకు ఆయా రాష్ట్రాల్లోనే సెలవులు ఉంటాయి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సెలవులు వివరాలు చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం గాంధీ జయంతి పబ్లిక్ హాలిడే కాబట్టి బ్యాంకులకు సెలవు. అక్టోబర్ 2 శుక్రవారం వచ్చింది. ఆ రోజున బ్యాంకులు పనిచేయవు. దసరా సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 24న సెలవు ప్రకటించింది ఆర్‌బీఐ. ఆ రోజున నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులకు హాలిడేనే. ఇక అక్టోబర్ 30న శుక్రవారం రోజు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు. ఇక అక్టోబర్ 4, 11, 18, 25 తేదీల్లో ఆదివారం సెలవు. ఆ నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులే. అక్టోబర్ 10న రెండో శనివారం సందర్భంగా బ్యాంకులకు సాధారణంగా ఉండే సెలవే. ఇక అక్టోబర్ 24న నాలుగోశనివారంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో దసరా హాలిడే ఉంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :