Thursday, May 21, 2020

These are the conditions to open shops in the AP



Read also:

ఏపీలో షాపులు ఓపెన్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్.కండిషన్లు ఇవే


లాక్ డౌన్ వలన ప్రజలు మాత్రమే కాదు.ప్రభుత్వాలు కూడా ఆర్ధికంగా నష్టపోయాయి.. ఇక తిరిగి ఆర్థిక వ్యవస్థలను మళ్లీ పట్టాలు ఎక్కించే క్రమంలో పడ్డాయి. లాక్ డౌన్ ని కొనసాగిస్తూనే కేంద్ర,రాస్తా ప్రభుత్వాలు పలు సడలింపులను ఇస్తున్నాయి. అందులో భాగంగానే షాపుల లావాదేవీలకు ఏపీ ప్రభుత్వం గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జీవోను కూడా జారీ చేసింది. కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా ఇతర అన్ని ప్రాంతాల్లో షాపులను తెరవచ్చని జీవోలో పేర్కొంది. అయితే దీనికి సంబంధించిన నిబంధనలు కూడా వెల్లడించింది. అవేంటో ఇక్కడ చూద్దాం!

★ సంస్థలు, దుకాణాలను ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 వరకు తెరవచ్చు.
◆మెడికల్ షాపులకు ఎక్కువ సేపు తెరిచి ఉంచడానికి అనుమతి.
◆ వస్త్ర, పాదరక్షలు, ఆభరణాల షాపులు తెరవరాదు.
◆ హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి లేదు. అయితే, టేక్ అవే, హోం డెలివరీలు చేసుకోవచ్చు.
◆పని చేసే సిబ్బంది చేతులను శానిటైజ్ చేసుకోవాలి. మాస్కులు కచ్చితంగా ధరించాలి.
◆ మొత్తం సిబ్బందిలో 50 శాతం మంది మాత్రమే పని చేయాలి.
◆ ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, లిఫ్టులు, వర్కింగ్, పార్కింగ్ ప్రదేశాలను ఉదయం, సాయంత్రం శానిటైజ్ చేయాలి.
◆ మరుగుదొడ్లను గంటకు ఒకసారి శుభ్రం చేయాలి.
◆ సిబ్బందికి శానిటైజర్లు, టిష్యూ పేపర్లు ఉండేలా చూసుకోవాలి.
◆ నిర్వాహకులు, సిబ్బంది ఆరోగ్యసేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
◆బార్బర్ షాపులకు అనుమతి.
◆ వినియోగదారులకు టచ్ లెస్ థర్మోమీటర్ల ద్వారా ఉష్ణోగ్రత పరీక్షించాలి.
◆ ప్రతి వినియోగదారుడి పేరు, ఫోన్ నంబర్ నమోదు చేయాలి.
◆ సిబ్బంది మాస్క్, గ్లోవ్స్ ధరించాలి.
◆ ప్రతి వినియోగదారుడికి సేవలు అందించిన తర్వాత గ్లోవ్స్ మార్చుకోవాలి.
◆ వినియోగదారుడికి కప్పే వస్త్రాలు, పరికరాలు, అన్నింటిని డిస్ ఇన్ఫెక్ట్ చేసిన తర్వాతే వాడాలి.
◆ లో బడ్జెట్ క్షౌరశాలల్లో తువ్వాలును వినియోగదారుడే తెచ్చుకోవాలి.
◆ వినియోగదారులు భౌతికదూరం పాటించేలా, మాస్కులు ధరించేలా చూడాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :