Thursday, May 21, 2020

Full salary for employees from may



Read also:

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - మే నెల నుంచి పూర్తి జీతం ఇవ్వాలని  సీఎం


గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆర్థిక శాఖ, ట్రెజరీకి ఆదేశాలు జారీ అయ్యాయి. కరోనా కారణంగా రాష్ట్రానికి ఆదాయానికి గండి పడడంతో మార్చి, ఏప్రిల్ జీతాల్లో కోత విధించింది ఏపీ ప్రభుత్వం. ఈ రెండు నెలల బకాయిల చెల్లింపు విషయంలో కూడా త్వరలోనే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
కరోనా ప్రభావంతో సీఎం, మంత్రులతో సహా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపు వాయిదా వేస్తూ..జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే.
నాలుగో తరగతి ఉద్యోగులు మినహా మిగిలిన ప్రభుత్వ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 50 శాతం జీతాల చెల్లింపు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు 100 శాతం జీతాల చెల్లింపులు వాయిదా వేశారు. అఖిల భారత సర్వీసు అధికారులకు 60 శాతం మేర జీతం చెల్లింపులు పోస్ట్ పోన్ చేశారు. నాలుగో తరగతి ఉద్యోగులు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు 10 శాతం మేర జీతాల చెల్లింపులను వాయిదా వేశారు.
లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి మాసంలో ఇచ్చినట్లుగానే ఏప్రిల్ మాసంలో కూడా వేతనాలు ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాపించకుండా..నిరంతరం కృషి చేస్తున్న వైద్య, ఆరోగ్య, పారిశుధ్య సిబ్బంది, పోలీసులకు పూర్తి వేతనాలు చెల్లిస్తోంది. పెన్షనర్లకు సగం పెన్షన్ మాత్రమే చెల్లించారు. అయితే..ఏప్రిల్ నెలలో పూర్తి స్థాయిలో పెన్షన్ అందించనట్లుగా ప్రభుత్వం స్పష్టం చేసింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :