Thursday, December 12, 2019

General info



Read also:

తల్లి తండ్రులను వేధిస్తే ఆరు నెలలు జైలు శిక్ష

కొంతమంది ముసలితనంలో కన్న తల్లితండ్రులను పట్టించుకోకుండా ఆస్తుల కోసం వారిని వేధింపులకు గురి చేస్తారు. ఇక ఆస్తులు రాయించుకున్న తరువాత వారిని సరిగ్గా పట్టించుకోకుండా అనాధశరణాలయాలలో చేర్చి మానసిక క్షోభకు గురి చేస్తారు. అలాంటి వారి పట్ల ఇప్పటి వరకు సరైన చట్టాలు లేవు. ఇప్ఫడు కేంద్ర ప్రభుత్వం తల్లితండ్రులను వేధించే వారి కోసం కఠిన చట్టాన్ని తీసుకురావడానికి చూస్తుంది.
తల్లి తండ్రులు, వృద్ధుల పోషణ సంక్షేమ(సవరణ) బిల్లు-2019"ను కేంద్ర మంత్రి ధావర్ చంద్ గెహ్లాట్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. తల్లితండ్రులను లేదా వృద్ధులను బౌతికంగా, మానసికంగా వేధించే పిల్లలు, సవతి పిల్లలు, దత్తత పిల్లలు, అల్లుడు, కోడలు, గార్డియన్లకు ఈ బిల్లు వర్తించనుంది.
ఈ బిల్లు ద్వారా తల్లితండ్రులను వేధిస్తే ఆరు నెలల జైలు శిక్షతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధించే కొత్త చట్టం అతి త్వరలో అమలులోకి రానుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :