Friday, December 13, 2019

2019 google search result



Read also:

2019లో గూగుల్‌లో ఇండియన్స్ ఎక్కువగా సెర్చ్‌ చేసినవివే!

ఆధునిక సాంకేతిక ప్రపంచంలో సమాచార విప్లవాన్ని మన ముందు ఉంచింది 'గూగుల్'. ఏ అంశంపై అయినా తగిన సమాచారం కావాలంటే గూగుల్ పై ఆధారపడాల్సిందే. గూగుల్ తన వార్షిక సంవత్సర డేటాను.. భారతదేశంలో ప్రజలు ఎక్కువగా శోధించిన అంశాల జాబితాను విడుదల చేసింది. అందులో మొదటి పది స్థానాల్లో వరుసగా క్రికెట్‌ ప్రపంచ కప్‌, లోక్‌సభ ఎన్నికలు, చంద్రయాన్‌-2, కబీర్‌ సింగ్(అర్జున్ రెడ్డి సినిమాకి రీ మేక్), అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్(హాలీవుడ్ మూవీ), ఆర్టికల్‌ 370, నీట్‌ రిజల్ట్స్‌, జోకర్‌(హాలీవుడ్ మూవీ), కెప్టెన్‌ మార్వెల్ (హాలీవుడ్ మూవీ), పీఎం కిసాన్‌ యోజన లు చోటుదక్కించుకున్నాయి.వాట్ కేటగిరిలో అత్యధికులు వెతికినవి.. 'ఆర్టికల్ 370', 'ఎగ్జిట్ పోల్', 'హౌడీ మోడీ', 'ఇ-సిగరెట్లు', ఆర్టికల్ 15, 'అయోధ్య కేసు' , 'సర్జికల్ స్ట్రైక్' మరియు 'పౌరుల జాతీయ రిజిస్ట్రార్.''అయోధ్య తీర్పు' కూడా ఇంటర్నెట్‌లో విస్తృతంగా శోధించబడింది. ఈ శోధన అక్టోబర్ చివరి నాటికి వేగవంతం కావడం ప్రారంభమై నవంబర్ 9 న పీక్ కు చేరుకుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :