Thursday, December 12, 2019

Bikers alert



Read also:

ఇక నెంబర్ ప్లేట్ వంచారో 420 కేస్

మీరు రోడ్డు ఎక్కుతున్నారా ? అయితే మీ వాహన నంబర్లు సరిగ్గా ఉన్నాయా? లేవా? చూసుకోండి.. లేకపోతే చట్ట ప్రకారంగా 420 కేసు నమోదవుతుంది. వాహన నంబర్ ప్లేటు సరిగ్గా లేకపోయినా ఆ నంబర్ ప్లేటులో అక్షరాలు, సంఖ్యలను తుడిసేసినా.. సరిగ్గా రాయకున్నా... ప్లేటును వంచినా... ట్రాఫిక్ పోలీసులను చూసినప్పుడు వాటిని కనపడకుండా చేసినా.. నంబర్ సంఖ్యలో ఒక నంబర్‌ను కనపడకుండా చేసినా.. నంబర్లు సరిగ్గా కనపడకుండా చేసినా.. తప్పుడు నంబర్ ప్లేటు పెట్టుకున్నా.... ఇక ట్రాఫిక్ పోలీసులు వాటిపై 420(మోసం), 465(ఫోర్జరీ) కింద కేసులు నమోదు చేయనున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు విచారణలో తప్పు అని నిర్ధారణ అయితే 420 సెక్షన్ కింద 7 ఏళ్ళు, 465 కింద 2 ఏళ్ళు జైలు శిక్ష కూడా పడుతుంది.
వాహనదారులు తమ నంబర్ ప్లేటు స్పష్టంగా కనపడేలా ఏర్పాటు చేసుకోవాలని రాచకొండ ట్రాఫిక్ పోలీసులు చూచిస్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనవరి నుంచి నవంబర్ 30 వరకు దాదాపు 12,314 మంది వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు వచ్చి, కనపడకుండా తిరిగారని గుర్తించారు. వీరందరీపై సాధారణ చలాన్‌తో పాటు సెక్షన్ 420, 465ల కింద కేసులు నమోదు చేశారు. చాలా మంది వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల నుంచి వారి చలానాల నుంచి తప్పించుకునేందుకు నంబర్ ప్లేటు కనపడకుండా చేస్తున్నారు. అయితే అలాంటి వారిని ఫొటోల రూపంలో, సీసీ కెమెరాల రూపంలో పట్టుకుని వారి తప్పు రుజువైతే ఐసీపీ సెక్షన్‌లు 420, 465 కింద జైలు ఊచలు లెక్కించాల్సిందే.నని అంటున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :