Monday, December 16, 2019

Benfite of aadhar link with pf account



Read also:

EPF-Aadhaar: మీ పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేస్తే లాభమిదే

మీకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉందా? మరి మీ ఈపీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేశారా? ఖాతాదారులు తమ ఆధార్ నెంబర్‌ను ఈపీఎఫ్ అకౌంట్‌కు లింక్ చేయాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO కోరుతోంది. మీరు మీ ఆధార్ నెంబర్‌కు ఈపీఎఫ్ అకౌంట్‌తో లింక్ చేస్తే ఓ ప్రయోజనం ఉంది. ఈపీఎఫ్ఓ నియమనిబంధనల్లో మార్పులున్నా, ఈపీఎఫ్ఓ ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకున్నా దానికి సంబంధించిన అప్‌డేట్స్ మీకు ఎప్పటికప్పుడు తెలుస్తుంటాయి. ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు, పీఎఫ్ అకౌంట్ హోల్డర్స్‌కు ఆన్‌లైన్ సేవల్ని అందిస్తున్న ఈపీఎఫ్ఓ.ఆధార్ లింక్ చేసినవారికి అప్‌డేట్స్ అందిస్తోంది. అంతేకాదు... ఈపీఎఫ్ఓ ఆన్‌లైన్ సేవల్ని పొందాలన్నా పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి.
  • ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్‌ epfindia.gov.in ఓపెన్ చేసి మీ పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.
  • ముందుగా ఓపెన్ చేయండి.ఆ తర్వాత e-KYC Portal పైన క్లిక్ చేయండి.
  • link UAN Aadhaar పైన క్లిక్ చేయండి.
  • మీ యూఏఎన్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి.ఆ తర్వాత మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి.
  • ఓటీపీ బటన్ క్లిక్ చేస్తే మళ్లీ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
  • ఓటీపీ ఎంటర్ చేస్తే మీ ఆధార్ నెంబర్‌ పీఎఫ్ అకౌంట్‌కు లింక్ అవుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :