Monday, December 16, 2019

24/7 Neft transactions



Read also:

ఇక నుంచి నెఫ్ట్‌ ద్వారా 24×7 ట్రాన్సుఫర్

ప్రభుత్వరంగ ఎస్‌బిఐ నుంచి ప్రయివేటు దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు వరకు అన్ని బ్యాంకుల్లో నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్సుఫర్ (ఎన్‌ఈఎఫ్‌టి) ట్రాన్సాక్షన్స్ డిసెంబర్ 16 నుంచి 24×7 అందుబాటులోకి వచ్చాయి.
ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంకు,ఐసిఐసిఐ సహా అన్ని కమర్షియల్ బ్యాంకుల్లో ఇది అందుబాటులోకి వచ్చింది.
నేటి నుంచి ప్రతి రోజు, ప్రతి వారం, ప్రతి నెల.. ఏ సమయంలోనైనా నెఫ్ట్ ట్రాన్సుఫర్ ఉపయోగించుకోవచ్చు. సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటుంది. కస్టమర్లకు ఏడాదిలో ప్రతి సమయంలోను అందుబాటులో ఉండేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వెసులుబాటు కల్పించింది.
ఎన్‌ఈఎఫ్‌టి ట్రాన్సాక్షన్ టైమింగ్స్ ఇదివరకు ఉదయం గం.8 నుంచి సాయంత్రం గం.6.30 వరకు ఉంది. ఇప్పుడు ఏ సమయంలోనైనా నెఫ్ట్ ద్వారా ట్రాన్సుఫర్ అంటే కస్టమర్లు పేమెంట్ చేసుకోవడానికి ఎంతో వెసులుబాటు దొరికినట్లే. అలాగే, ఇప్పటి వరకు కేవలం బ్యాంకులు ఓపెన్ ఉన్న రోజునే అందుబాటులో ఉండగా, ఇప్పటి నుంచి ప్రతి రోజు రౌండ్ ది క్లాక్ ఉంటుంది. సెలవు దినాల్లో, పండుగ సమయాల్లో బ్యాంకులు తెరిచే వరకు వేచి ఉండకుండా ఇప్పుడు అత్యవసర బదలీ సౌకర్యం ఉంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :