Monday, December 16, 2019

Shocking information for ration card holders



Read also:

సగటున నెలకు 300 యూనిట్లు దాటితే కార్డు రద్దు 

ఆరు నెలల్లో సగటున నెలకు 300 యూనిట్ల విద్యుత్తు వినియోగిస్తున్నట్లు తేలితే ఆ కుటుంబానికి బియ్యం కార్డు రద్దు కానుంది. ఈ ఏడాది మే నుంచి ఆగస్టు వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో విద్యుత్‌ వినియోగం ఎక్కువగా ఉండింది. ఈనేపథ్యంలో 300 యూనిట్లు దాటిన కుటుంబాల్లో పేదలున్నా కొత్త నిబంధనల ప్రకారం అనర్హులుగా మారనున్నారు.  వలంటీర్లు సేకరించిన వివరాలు రెవెన్యూ అధికారుల నుంచి విద్యుత్తు కార్యాలయానికి వెళ్తున్నాయి. ఎవరిదైనా ఒక నెల వినియోగం ఎక్కువగా ఉంటే అంతకంటే వెనక్కు వెళ్లి వివిధ నెలల వినియోగాన్ని పరిశీలించి సగటు లెక్కలు తీస్తున్నారు. 

ముందుకు సాగని నవశకం సర్వే 

నవశకం సర్వే ముందుకు సాగడం లేదు. గడువు ముంచుకొస్తుండటంతో ఇటు వలంటీర్లు, అటు అధికారులు ఇబ్బంది పడుతున్నారు. రేషన్‌ కార్డులు, పింఛన్లు, అమ్మఒడి. తదితర కార్యక్రమాలకు సంబంధించి శాఖలవారీగా సర్వే మొదలైంది. ఈనెల 22వ తేదీనాటికి పూర్తిచేసి ఆన్‌లైన్‌లో పొందుపరచాల్సి ఉంది. సిబ్బంది వద్ద ఉన్న సమాచారాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి అనేక అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అద్దె ఇళ్లలోనివారు వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడం ప్రధాన సమస్యగా మారుతోంది. కొన్ని సందర్భాల్లో ఇంటి నెంబర్లకు, వ్యక్తుల వివరాలకు పోలిక ఉండడం లేదు. అదే సమయంలో సాంకేతిక సమస్యలూ తలెత్తుతున్నాయి. సర్వర్‌ పని చేయకపోవడంతో అడుగు ముందుకు సాగడం లేదు. ప్రతి వలంటీరుకు స్మార్ట్‌ఫోన్‌ ఇస్తామని చెప్పారు. ఆ ఊసే లేకపోవడంతో వలంటీర్లు తమ సొంత ఫోన్లతో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడానికి తంటాలు పడుతున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :