Tuesday, November 5, 2019

Use this app while driving



Read also:

సహజంగా కారు లేదా టూ-వీలర్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ లో ముఖ్యమైన ఫోన్ కాల్స్ నోటిఫికేషన్స్ మిస్ అవకుండా ఉండడం కోసం, అలాగే గూగుల్ మ్యాప్ నావిగేషన్ కోసం చాలామంది స్మార్ట్ ఫోన్ వాడుతూ ఉంటారు కదా.
అయితే స్మార్ట్ ఫోన్ తో పనిలేకుండా, ఈ మధ్య కాలంలో వస్తున్న అనేక కార్లలో Android Auto ఆధారంగా పనిచేసే ఆడియో ఇంటర్ఫేస్ లభిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని ఉపయోగించడం ద్వారా డ్రైవింగ్ నుండి దృష్టి మళ్లకుండా, గూగుల్ నావిగేషన్ మొదలుకొని, మీకు నచ్చిన పాటలు వినడం వరకు అనేక రకాల పనులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఆండ్రాయిడ్ ఆటో ఆధారంగా పనిచేసే ఆడియో ఇంటర్ఫేస్ కనుక మీ కార్లో లేకపోతే.ఆందోళన చెందాల్సిన పనిలేదు.
తాజాగా గూగుల్ సంస్థ Android Auto మొబైల్ అప్లికేషన్ కూడా Google Play Storeలో అందరికి అందుబాటులో వచ్చింది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా, ఇకమీదట ఆండ్రాయిడ్ ఆటో ఆడియో ఇంటర్ఫేస్లో లభించే అన్ని రకాల సదుపాయాలు నేరుగా మీ స్మార్ట్ఫోన్ స్క్రీన్ మీద పొందొచ్చు. సహజంగా ఈ మధ్య కాలంలో అనేక మంది ప్రత్యేకంగా మొబైల్ హోల్డర్ అమర్చుకోవడం ద్వారా తమ ఫోన్‌ని నావిగేషన్ కోసం ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే అలాంటప్పుడు ఆండ్రాయిడ్ మామూలు ఇంటర్ఫేస్ వలన డ్రైవింగ్ చేసే సమయంలో దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది.
ఈ నేపథ్యంలో మెరిట్ డ్రైవింగ్ సమయంలో గూగుల్ ప్లే స్టోర్ నుండి Android Auto అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని, గూగుల్ మ్యాప్ నావిగేషన్ మొదలుకొని, పాటలు వినడం కోసం మ్యూజిక్ అప్లికేషన్ ల వరకు మీకు నచ్చిన వాటిని చాలా సులభంగా పెద్ద యూసర్ ఇంటర్ఫేస్ మీద సెలెక్ట్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ లో ఈ లింకు నుండి Android Auto for Phone Screens అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :