More ...

Tuesday, November 5, 2019

YS Jagan serious about prathibha awards goRead also:

ప్రతిభా పురస్కారాలకు కలాం పేరు మార్పుపై సీఎం జగన్ సీరియస్‌ అయ్యారు. తన దృష్టికి తీసుకురాకుండా పేరు మార్చడంపై జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యథాతథంగా అబ్దుల్‌ కలాం పేరు పెట్టాలని సూచించారు. మరికొన్ని అవార్డులకు మహనీయుల పేర్లు పెట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు. గాంధీ, అంబేడ్కర్‌, పూలే, జగ్జీవన్‌రామ్‌ పేర్లతో అవార్డులు ఇవ్వాలని జగన్‌ సూచించారు.
ఇంతకీ అసలు విషయమేంటంటే.. నవంబర్ 11న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జరుపుకునే జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇచ్చే 'డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కార అవార్డుల' పేరును 'వైఎస్‌ఆర్ విద్యా పురస్కార అవార్డులు'గా మార్చుతూ అధికారులు జీవో జారీ చేశారు.

జీవోపై జగన్ సీరియస్.. రద్దు చేయాలని ఆదేశాలు

ఈ జీవో పెను దుమారమే రేపింది. మౌలానా జయంతి సందర్భంగా ఇచ్చే అవార్డులకు కూడా వైఎస్సార్ పేరు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో.. సీఎం జగన్ తాజాగా ఈ ఆదేశాలిచ్చారు. విమర్శలకు కారణమైన జీవో ఇదే.

Subscribe to this Blog via Email :