More ...

Tuesday, November 5, 2019

Reason behind why tahsildar killed VijayaraddyRead also:

తెలంగాణలో తాజాగా తహసీల్దార్ విజయారెడ్డిని సజీవదహనం చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆఫీసులోనే పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ప్రాణాలు కోల్పోయారు. సోమవారం జరిగిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ కేసులో నిందితుడు సురేష్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఆయనపై అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు ఐపీసీ 302, 307, 333 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అదేవిధంగా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు సురేష్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. ఓ భూమికి సంబంధించి పట్టా కోసం కొంతకాలంగా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు.

కోర్టు కేసులు, జేసీ ఆదేశాలు ఉన్నాయని తహశీల్దార్ విజయారెడ్డి సురేష్‌కు చెప్పారట. తాను ఎంత వేడుకున్నా పట్టా ఇవ్వడం కుదరదని చెప్పారని. సోమవారం మధ్యాహ్నం వెళ్లి మరోసారి విజ్ఞప్తి చేశానని సురేష్ తెలిపాడు. ఎమ్మార్వో స్పందించక పోవడంతో పెట్రోలు తనపై పోసుకొని..
తర్వాత ఆమెపై పోశానన్నాడు. తనకు నిప్పంటించుకొని ఆమెను కూడా తగులబెట్టానని చెప్పాడు. తాను కూడా చనిపోవాలని ఈ పని చేసినట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా నిందితుడు సురేష్‌కు కూడా 60శాతంపైగా గాయాలు అయ్యాయి.
అలాగే ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్, అటెండర్‌, మరో వ్యక్తి చికిత్సపొందుతున్నారు. అటెండర్ చంద్రయ్యకు 60శాతంపైగా గాయాలుకాగా. డీఆర్‌డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా డ్రైవర్ గుర్ నాథం కూడా అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Subscribe to this Blog via Email :