Tuesday, November 26, 2019

TTD closed on dec 25 and 26th dates



Read also:

డిసెంబర్ 25, 26 తేదీల్లో తిరుమల ఆలయం మూసివేత
సూర్య గ్రహణం కారణంగా డిసెంబర్‌ 25, 26 తేదీల్లో రెండు రోజుల్లో కలిపి 13 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నారు. డిసెంబరు 26న గురువారం ఉదయం 8.08 గంటల నుండి ఉదయం 11.16 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆరు గంటల ముందుగా, డిసెంబరు 25న బుధవారం రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయం తలుపులు మూస్తారు. డిసెంబరు 26న గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం తలుపులు తెరిచి ఆలయశుద్ధి అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. భక్తులు గమనించాలని టీటీడీ అధికారులు తెలిపారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :