Tuesday, November 26, 2019

Outline of voter ID card to be changed and new features



Read also:

ఇప్పుడంటే ఆధార్ కార్డు వచ్చింది కానీ.ఇదివరకు ఐడెంటిటీ కోసం కానీ.అడ్రస్ ప్రూఫ్ కోసం కానీ ఎవరైనా ఓటర్ ఐడీ కార్డునే వాడేవారు. ఓటు వేయడం దగ్గర్నుంచి.అన్నింటికీ ఓటర్ ఐడీ కార్డు ఉపయోగపడేది. సాధారణంగా బ్లాక్ అండ్ వైట్ కార్డుతో పాటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ) స్మార్ట్ ఓటర్ ఐడీలను కూడా ప్రవేశపెట్టింది. వాటినే కలర్ ఓటర్ ఐడీ అని కూడా అంటారు. బ్లాక్ అండ్ వైట్ ఓటర్ ఐడీ కార్డు ఉచితంగానే ఇస్తారు. కానీ.స్మార్ట్ ఓటర్ ఐడీ కార్డు కావాలంటే ప్రభుత్వ సేవ కేంద్రాలకు వెళ్లి ఇరవై లేదా ముప్పై చెల్లిస్తే ఇస్తారు. దాన్నే ఎలక్టోర్ ఫోటో ఐడెంటిటీ కార్డు అని, ఎపిక్ అని కూడా పిలుస్తారు. అయితే.ఆ ఎపిక్ లోనే ఇప్పుడు ఈసీఐ కొన్ని మార్పులు చేస్తోంది.

దాని రూపురేఖలనే మార్చేస్తోంది.ఎపిక్ కార్డు ఉంటే చాలు.ఓటర్ కు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకునే ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే కర్ణాటకలో కొత్త ఎపిక్ కార్డుల ఇష్యూను ఈసీ ప్రారంభించింది. త్వరలోనే దేశమంతటా ఓటర్లందరికీ కొత్త ఎపిక్ కార్డులను ఇవ్వబోతోంది. 

ఇంతకీ కొత్తగా వచ్చే స్మార్ట్ ఓటర్ కార్డులో ఉండే ఫీచర్లేంటో తెలుసా? ప్లాస్టిక్ తో తయారు చేసే ఈ కార్డులో చాలా లేయర్లు ఉంటాయి. అంటే ఈ కార్డును డుప్లికేట్ చేయలేం. ఈసీ హోలోగ్రామ్ ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రతి కార్డుపై యూనిక్ బార్ కోడ్ ఉంటుంది. ఈ బార్ కోడ్ ద్వారా ఓటర్ కు సంబంధించిన బేసిక్ డిటెయిల్స్ అంటే పేరు, అడ్రస్, పుట్టిన తేదీ లాంటి వాటిని భవిష్యత్తులో స్టోర్ చేయడం కోసం ఈసీ సిద్ధమవుతోంది.

భవిష్యత్తులో ఈ కార్డు బార్ కోడ్ ఉపయోగించి ఓటర్ కు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకునే వెసులుబాటును ఈసీ కల్పించనుంది.ప్రస్తుతానికి ఈ కార్డు ధరను 30 రూపాయిలుగా నిర్ణయించాం. కానీ.త్వరలోనే కార్డు ధరను ఇంకాస్త తగ్గించడానికి ప్రయత్నిస్తాం. 18 ఏళ్లు నిండి కొత్తగా ఓటర్ ఐడీ కార్డు కోసం అప్లయి చేసుకున్న వాళ్లకు సరికొత్త స్మార్ట్ ఓటర్ ఐడీనే అందిస్తాం. వాళ్లకు వచ్చే సంవత్సరం జనవరి 25 వరకు కొత్త కార్డులు అందుతాయి. ఆ కార్డుపై ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ డిజిటల్ సంతకం కూడా ఉంటుంది. ఇప్పటికే బ్లాక్ అండ్ వైట్ ఓటర్ కార్డు ఉన్నవాళ్లు కొత్త ఫీచర్లతో వచ్చే ఎపిక్ కార్డు కావాలనుకుంటే.ఈసీ వెబ్ సైట్ లో అప్లయి చేసుకోవచ్చు. కనీసం 15 రోజుల సమయంలో కొత్త ఎపిక్ కార్డును ఈసీ ఇంటికి పంపిస్తుంది.అని కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సంజీవ్ కుమార్ తెలిపారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :