Thursday, November 28, 2019

Indian railway recruitment



Read also:

భారతీయ రైల్వేలో ఉద్యోగాల జాతర కొనసాగుతూనే ఉంది. కొద్ది రోజుల క్రితమే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈశాన్య రైల్వే మరో 1104 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. గోరఖ్‌పూర్‌లోని మెకానికల్, సిగ్నల్, బ్రిడ్జ్ వర్క్‌షాప్, ఇజ్జత్ నగర్‌లోని మెకానికల్ వర్క్‌షాప్, డీజిల్ షెడ్, క్యారేజ్ అండ్ వేగన్, లక్నోలోని క్యారేజ్ అండ్ వేగన్, గోండాలోని డీజిల్‌షెడ్‌లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఈశాన్య రైల్వే. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 25 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

Catageory wise posts

మొత్తం ఖాళీలు- 1104 ఫిట్టర్- 494
వెల్డర్- 121
ఎలక్ట్రీషియన్- 99
కార్పెంటర్- 145 
పెయింటర్- 106
మెషినిస్ట్- 1
టర్నర్-15
మెకానిక్ డీజిల్- 85
ట్రిమ్మర్- 8

Notification Details

దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 26
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 25
శిక్షణ ప్రారంభం- 2020 ఏప్రిల్ 1
విద్యార్హత- కనీసం 50% మార్కులతో 10వ తరగతి పాస్ కావడంతో పాటు ఐటీఐ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :