Thursday, November 21, 2019

How to apply new ration card



Read also:

రేషన్ కార్డు.పేదోళ్ల ఐడెంటిటీ. నెల రోజుల పాటు బతుకు బండి నడవాలంటే కార్డు ఉండాల్సిందే. నోటి కాడికి ఇంత ముద్ద పోవాలంటే రేషన్ కార్డు కావాల్సిందే. అందుకే.దీన్ని పొందేందుకు పేద, మధ్య తరగతి ప్రజలు ఎన్నో తిప్పలు పడతారు. చాలా మందికి రేషన్ కార్డును ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలీదు. అలాంటి వాళ్లు ఈ పద్ధతుల ద్వారా రేషన్ కార్డును పొందవచ్చు. ప్రస్తుతం ఏపీలో తెల్ల రేషన్ కార్డు, గులాబీ రేషన్ కార్డు ఉన్నాయి. దారిద్ర్యపు రేఖకు దిగువన ఉన్నవారికి తెల్ల రేషన్ కార్డు, ఎగువన ఉన్నవారికి పింక్ రేషన్ కార్డును ప్రభుత్వం అందజేస్తోంది. ఇందులో ఏ కార్డు పొందాలన్నా కనీసం వారం సమయం పడుతుంది. మొదటగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఫారం నింపాలి.

ఇవి అన్ని మీసేవ కేంద్రాల్లో దొరుకుతాయి. లేకపోతే మీసేవ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తును నింపాక.. దానికి అవసరమయ్యే ఆధార్, ఓటర్ కార్డు, ఇంటి అడ్రస్ తెలిపే తదితర డాక్యుమెంట్లు జత చేయాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తును తీసుకెళ్లి మీసేవ సెంటర్‌లో అందజేసి, ఫీజు చెల్లించాలి.

మీసేవ నిర్వాహకులు ఇచ్చే నంబరుతో కూడిన స్లిప్‌ను భద్రపర్చుకోవాలి. ఒకవేళ మీరు అర్హులైతే రేషన్ కార్డు మంజూరైనట్లు మొబైల్ నంబరుకు మెసేజ్ వస్తుంది. అప్పుడు స్లిప్ తీసుకెళ్లి మీసేవలో అందజేసి రేషన్ కార్డును పొందవచ్చు. అంతేకాకుండా.. 'స్పందన' యాప్ లేదా 1800 452 4440, 1100 టోల్‌ఫ్రీ నంబర్లకు కాల్ చేసి కూడా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :