Saturday, November 9, 2019

ayodya judgement full details



Read also:

అయోధ్య కేసులో సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. వివాదాస్పద 2.77 ఎకరాల స్థలం హిందువులదేనని తేల్చి చెప్పింది. అరగంటపాటు తీర్పు ప్రతిని జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ చదవి వినిపించారు.
తీర్పులోని ముఖ్యాంశాలు మొదట్నుంచి.
  • షియా వక్ఫ్‌బోర్డు దాఖలు చేసిన ప్రత్యేక లీవ్‌ పిటిషన్‌ కొట్టివేస్తున్నాం.
  • రాజకీయాలు, చరిత్రకు అతీతంగా న్యాయం ఉండాలి.
  • ప్రాథమిక విలువలు, మత సామరస్యాన్ని ప్రార్థనామందిరాల చట్టం పరిరక్షిస్తుంది
  • ఇది వ్యక్తిగత హక్కులు కోసం దాఖలు చేసిన వ్యాజ్యం కాదు.
  • మసీదు ఎవరు కట్టారో, ఎప్పుడు కట్టారో స్పష్టం కాలేదని హైకోర్టు చెప్పింది.
  • పురావస్తు శాఖ నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నాం.
  • రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందింది.
  • వివాదాస్పద స్థలంపై ఎవరూ యాజమాన్య హక్కులు కోరలేదు.
  • మందిరం ఉన్నట్టు పురావస్తు శాఖ నివేదికలు చెబుతున్నాయి.
  • అయోధ్యను రామ జన్మభూమిగా హిందువులు విశ్వసిస్తారు.
  • రాముడు అయోధ్యలోనే జన్మించాడని ముస్లింలు కూడా అంగీకరిస్తున్నారు.
  • రాముడు అయోధ్యలోనే జన్మించాడన్న విషయంలో వివాదం లేదు.
  • ప్రధాన గుమ్మటం కింద గర్భాలయం ఉందని హిందువులు విశ్వసిస్తున్నారు.
  • ముస్లింలు లోపల, హిందువులు బయట ప్రార్థనలు చేసేవారు.
  • నిర్ణయానికి ముందు రెండు మతాల విశ్వాసాలు పరిగణనలోకి తీసుకున్నాం.
  • షియా వక్ఫ్‌ బోర్డు క్లెయిమ్‌ తిరస్కరిస్తున్నాం.
  • మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉండేది.
  • వివాదాస్పద స్థలంలో మసీదు లేదని, అక్కడ హిందూ నిర్మాణం ఉందని పురావస్తు విభాగం చెబుతోంది.
  • మందిరాన్ని కూలగొట్టి మసీదు నిర్మించారని పురావస్తు శాఖ ఎక్కడా చెప్పలేదు.
  • మొఘలులు సమయం నుంచే హక్కు ఉన్నట్లు వక్ఫ్‌ బోర్డు నిరూపించలేకపోయింది.
  • శుక్రవారం నాడు ముస్లింలు ప్రార్థనలు చేసినట్లు మాత్రమే ఆధారాలు సమర్పించింది.
  • 1856-57కు ముందు లోనికి వెళ్లే హక్కు హిందువులకు ఉండేది కాదు.
  • ఆ సమయంలో పక్కనే ఉండే రామ్‌ఛబుత్రాలో హిందువులు పూజలు చేసేవారు.
  • 1949లో ఆ స్థలం హిందువుల అధీనంలోకి వచ్చింది.
  • 1949 తర్వాత ఆ స్థలం తమ అధీనంలో ఉన్నట్లు లేదా ప్రార్థనలు చేస్తున్నట్లు ముస్లింలు నిరూపించలేదు.
  • వివాదాస్పద స్థలం కాకుండా మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలి.
  • అయోధ్యలోనే వక్ఫ్‌ బోర్డుకు 5 ఎకరాలు కేటాయించాలి.
  • అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల స్థలం హిందువులదే.
  • ఆ స్థలంలో రామమందిరం నిర్మాణంపై విధివిధానాలకు ఓ ట్రస్టు ఏర్పాటు చేయాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :