Saturday, November 9, 2019

YSR Raithu barosa dead line extended



Read also:

రైతులకు శుభవార్త.గడువు తేదీ పొడిగింపు

YSR Raithu barosa dead line extended

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం రైతు భరోసా. దీని ద్వారా ఇప్పటివరకు 40 లక్షల 84 వేల మందికి సాయం అందిందని వ్యవసాయ శాఖ కమిషనర్‌ అరుణ్‌ కుమార్‌ తెలియజేసారు. దీనికి సంబంధించి బుధవారం లక్షా ఏడు వేల రైతుల బ్యాంకు ఖాతాల్లో 97కోట్లు రూపాయలు జమ చేసినట్టు చెప్పారు. ఈ పథకం యొక్క కొత్త లబ్దిదారులకు ప్రతీ బుధవారం రైతు భరోసా ఇస్తామని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు నవంబర్ 15కల్లా అర్హులైన రైతులందరికీ వారి ఖాతాల్లో డబ్బులు జమ చెయ్యాలని ఆదేశించారని అన్నారు. ఈ మేరకు నవంబర్ 9న రైతు భరోసా కోసమని ప్రత్యేకంగా స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఇందులో అన్ని మండలాల్లో తహశీల్దార్‌, వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో రైతుల అర్జీలు పరిష్కరిస్తామని అన్నారు.అంతేకాకుండా కౌలు రైతుల విషయంలో డిసెంబర్ 15 వరకు రైతు భరోసా గడువు పెంచినట్లు చెప్పుకొచ్చారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :