Saturday, November 9, 2019

CM pics decision in education review



Read also:

విద్యాశాఖ సమీక్షలో సీఎం జగన్‌ నిర్ణయం
పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమ బోధనపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిమేర వెనక్కి తగ్గింది. తొలిదశలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు మాత్రమే ఆంగ్ల మాధ్యమాన్ని వర్తింప జేయాలంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమ బోధనకు పూర్తిస్థాయిలో సన్నద్ధత లేనందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమ బోధనపై సీనియర్ అధికారులతో సమావేశమై సమీక్షించిన సీఎం ఈ ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ఆంగ్ల భాషకు చెందిన ప్రయోగశాలను ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు. 14 నుంచి ప్రారంభమయ్యే 'నాడు-నేడు' కార్యక్రమంలో భాగంగా ప్రయోగ శాలలు ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. మొదటి దశలో 1 నుంచి 6వ తరగతి వరకూ ఇంగ్లీషు మాధ్యమంలో బోధించాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దీనిపై తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అలాగే పాఠశాలల్లో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ విధానాలను పాటించాల్సిందిగా సీఎం నిర్ణయించారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :