Monday, October 28, 2019

how to check pm kisan status



Read also:

నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.6,000 ఇస్తోంది. ఈ మొత్తాన్ని రూ.2,000 చొప్పున మూడు విడతల్లో ఇస్తోంది. అర్హులైన రైతులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద వచ్చే మొత్తం నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లలో క్రెడిట్ అవుతుంది. బెంగాల్, తెలంగాణ వంటి ఒకటి రెండు రాష్ట్రాలు మినహా మిగతావి పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.6,000కు మరికొంత జమ చేసి రైతు భరోసా - పీఎం కిసాన్ అని పేరు పెట్టింది.

How to check pm kisan status

పీఎం కిసాన్ నిధి పడిందా, లేదంటే ఇలా చెక్ చేసుకోండి
1.నాలుగో విడత అమౌంట్
నరేంద్ర మోడీ సర్కార్ మూడో విడత ఫండ్స్ రైతుల అకౌంట్లలోకి వేసింది. దాదాపు అందరి రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయి.ఈ మూడో విడతలో 50 వేల మంది అర్హులు ఉంటే 20 వేల మంది అకౌంట్లలో మాత్రమే పడింది. ఈ స్కీం అమలు కావాలంటే ఆయా రాష్ట్రాలు లబ్ధిదారుల పేరు, వయస్సు, కేటగిరీ (ఎస్సీ/ఎస్టీ), ఆధార్ నెంబర్, బ్యాంకు అకౌంట్, మొబైల్ నెంబర్ వంటి వివరాలు సిద్ధం చేయాలి. లబ్ధిదారులు తమ అకౌంట్లలో డబ్బులు జమ గురించిన స్టేటస్‌ను pmkisan.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.
2.ఎందుకు జమ కాలేదో తెలుసుకోవచ్చు
మూడో విడతలో డబ్బు జమ కాని వారు కూడా తమ అకౌంట్లలో డబ్బులు ఎందుకు జమ కాలేదో పై వెబ్ సైట్ ద్వారా కారణాలు తెలుసుకోవచ్చు. మూడో విడతగా రూ.2,000 మొత్తం జమ కాని వారు కింది విధంగా తమ అకౌంట్లో డబ్బులు ఎందుకు జమ కాలేదో తెలుసుకోవచ్చు.
3.ఇలా చేయండి
  • తొలుత pmkisan.gov.in వెబ్ సైట్‌లోకి వెళ్లాలి.
  • ప్రాసెస్‌లో ఉంటే కనుక త్వరలో మీ అకౌంట్లో జమ అవుతుందని చెబుతుంది.
  • సబ్సిడీ ట్రాన్సుఫర్‌లో ఏదైనా సమస్య ఉంటే కనుక వెబ్ సైట్‌లో స్పష్టత ఇస్తుంది.
  • ఏ సమస్య ఉందో వెబ్ సైట్ సూచించిన తర్వాత అందుకు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి.
  • రెండో విడతకు, మూడో విడతకు మధ్య ఈ స్కీంలో చేరిన వారికి రిజిస్ట్రేషన్, ఇతర సమస్యల కారణంగా ఆలస్యం అయ్యే అవకాశాలు కొట్టిపారేయలేం.
  • సబ్సిడీ రాకుంటే వెబ్ సైట్‌కు వెళ్లి, పోర్టల్‌కు కుడి వైపున ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి
  • న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, ఎడిట్ ఆధార్, ఫెయిల్యూర్ రికార్డ్, బెనిఫిషియరీ స్టేటస్, బెనిఫిషియరీ లిస్ట్ అనే 4 ఆప్షన్లు ఉంటాయి.
  • ఇందులో బెనిఫిషియరీ స్టేటస్ ఎంచుకోండి. మరో కొత్త విండో ఓపెన్ అవుతుంది.
  • అందులో ఆధార్ నెంబర్, బ్యాంకు అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్ సాయంతో మూడో విడ డబ్బులు వచ్చాయా లేదా కూడా తెలుసుకోవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :