Sunday, October 27, 2019

Grama sachivalayam reduced cut off marks



Read also:

గ్రామ, వార్డ్ సచివాలయ ఓసీ, బీసీ అభ్యర్థుల కటాఫ్ మార్కుల తగ్గింపు...?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించి ఫలితాలను విడుదల చేసి గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసింది. కానీ చాలా జిల్లాలలో పూర్తి స్థాయిలో గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాల భర్తీ కాలేదు. 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాల్లో మిగిలిన ఉద్యోగాల కోసం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ప్రభుత్వం కటాఫ్ మార్కులను కొద్ది రోజుల క్రితం తగ్గించింది.
Grama sachivalayam
ప్రస్తుతం గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగ నియామకాల్లో బీసీ, ఓసీ అభ్యర్థులకు ప్రభుత్వం కటాఫ్ మార్కులను తగ్గించబోతుందని సమాచారం. 5 నుండి 10 శాతం వరకు బీసీ , ఓసీల కటాఫ్ మార్కులను ప్రభుత్వం తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది.మరో రెండు, మూడు రోజుల్లో ఓసీ, బీసీల కటాఫ్ మార్కుల తగ్గింపు గురించి అధికారికంగా ప్రభుత్వం నుండి ప్రకటన రాబోతుందని సమాచారం.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి కటాఫ్ మార్కుల ప్రతిపాదనలను రేపు పంపనుందని సమాచారం. 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాల్లో దాదాపు 47,000 ఉద్యోగాలు ఇంకా భర్తీ కాలేదని తెలుస్తోంది. ఓసీ, బీసీ కటాఫ్ మార్కులను తగ్గించటం ద్వారా దాదాపు 25 వేల పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఎస్సీ, ఎస్టీ కటాఫ్ మార్కులను తగ్గించటం ద్వారా ఈ కేటగిరీల్లోని పోస్టులన్నీ ఇప్పటికే భర్తీ అయ్యాయని తెలుస్తోంది. ఓసీ, బీసీ అభ్యర్థుల కటాఫ్ మార్కులను తగ్గిస్తే ఈ కేటగిరీల్లోని మిగిలిన పోస్టులు కూడా పూర్తి స్థాయిలో భర్తీ అయ్యే అవకాశం ఉంది. గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షలు రాసిన ఓసీ, బీసీ అభ్యర్థులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :