More ...

Monday, October 28, 2019

Railway helpline numbersRead also:

రైల్లో ప్రయాణిస్తున్నారా? ఏ రకమైన సాయానికి ఏ నెంబర్. తెలుసుకోండి

వేధించినా, దొంగతనం జరిగినా
రైల్వే స్టేషన్‌లో లేదా రైళ్లలో ఎవరైనా వేధిస్తున్నా లేదా దొంగలు ఉన్నారనే అనుమానాలు కలిగినా లేదా దొంగతనం జరిగినా వెంటనే 182కు ఫోన్ చేయాలి. మీ ప్రయాణానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తే తర్వాత స్టేషన్‌కు రైలు చేరుకోగానే రైల్వే పోలీసులు సిద్ధంగా ఉంటారు. ఫిర్యాదును స్వీకరిస్తారు. అందుకు తగిన విధంగా చర్యలు తీసుకుంటారు. 182 మరియు 1800-111-322 రైల్వేస్ సెక్యూరిటీ హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్లు. దొంగతనం, వేధింపులు, పిక్ పాకెటింగ్ ఇతర క్రిమినల్ సంఘటనలపై ఫిర్యాదు చేయవచ్చు.
ఆరోగ్యం సమస్యలు వస్తే
రైలులో ప్రయాణించే సమయంలో ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే 138 నెంబర్‌కు ఫోన్ చేయాలి. ఏ వైద్య సహాయం కావాలనే వివరాలు వెంటనే రైళ్లోని టీసీలకు సమాచారం అందిస్తారు. తర్వాతి స్టేషన్లో వైద్యులు అందుబాటులో ఉంటారు. తర్వాత స్టేషన్లో స్టాప్ లేకపోయినా వైద్య సహాయం కోసం నిలుపుతారు. 138 నెంబర్ 24x7 హెల్ప్ లైన్.
మహిళలకు ప్రత్యేకంగా 1091
మహిళలకు ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు వెంటనే ఫోన్ చేయడానికి 1091 కేటాయించారు. ఇది ప్రత్యేక వుమెన్ హెల్ప్ లైన్. మహిళలకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ నెంబర్‌కు కాల్ చేయాలి.
పిల్లల కోసం హెల్ప్‌లైన్
మహిళలకు ఉన్నట్లే చిన్న పిల్లల కోసం కూడా ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. చిన్నారులకు సంబంధించిన ఎలాంటి వైద్య సేవలు కావాలన్నా 1098కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చు.
ఎమర్జెన్సీ సమయంలో
1072 ఇది రైల్వే యాక్సిడెంట్ ఎమర్జెన్సీ సర్వీస్ నెంబర్. రైలు ప్రమాదాలు సంభవించినప్పుడు వెంటనే ఈ నెంబర్‌కు కాల్ చేయాలి. బాధితులకు సాయం అందించేందుకు సమీపంలోని రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి వెంటనే చేరుకుంటారు.
కోచ్ శుభ్రంగా లేకపోయినా-ఫుడ్ క్వాలిటీ లేకపోయినా
ప్రయాణిస్తున్న బోగీలు అపరిశుభ్రంగా కనిపించినా లేదా బోగీలో సౌకర్యాలు బాగా లేకున్నా 58888కు ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంది. ఈ నెంబర్‌కు ఎస్సెమ్మెస్ చేయాలి. దీనికి టోల్ ప్రీ నెంబర్ 1800-111-321. ఈ నెంబర్‌కు ఫోన్ చేసి ఫుడ్ క్వాలిటీ సహా ఇతర అంశాలపై కూడా ఫిర్యాదు చేయవచ్చు.
రిజర్వేషన్ సమాచారం
139 ద్వారా రిజర్వేషన్ సమాచారం తెలుసుకోవచ్చు. టిక్కెట్ నెంబర్‌ను జత చేసి ఈ నెంబర్‌కు ఎస్సెమ్మెస్ చేస్తే మనకు కావాల్సిన వివరాలు వస్తాయి. పీఎన్ఆర్ నెంబర్, ట్రెయిన్ అరైవల్, డిపార్చర్ ఎంక్వయిరీ, అకామిడేషన్ అవలబులిటీ, ఫేర్ ఎంక్వైరీ, ట్రెయిన్ టైమ్ టేబుల్ ఎంక్వైరీ, ట్రైన్ పేరు లేదా నెంబర్ తెలుసుకోవచ్చు.

Subscribe to this Blog via Email :