Thursday, August 15, 2019

వాట్సప్ లో ఫింగర్ ప్రింట్ ఫీచర్ వచ్చేసింది.



Read also:

వాట్సప్లో ఫింగర్ ప్రింట్ ఫీచర్ వచ్చేసింది... పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు ఎదో ఒక కొత్త ఫీచర్ తీసుకు వస్తూ యూజర్లను ఆకట్టుకుంటుంది. ఇదే క్రమంలో ఇప్పుడు వాట్సాప్ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ఫింగర్ ప్రింట్ ఫీచర్ ను తీసుకు వస్తోంది. ఈ ఫీచర్ తో ఆండ్రాయిడ్ కోసం వాట్సాప్ యొక్క బీటా ప్రోగ్రామ్లో నమోదు చేసుకున్న వారికి ఈ ఫీచర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. IOS వినియోగదారులకు గత సంవత్సరం నుండే ఫింగర్ ప్రింట్ ఫీచర్ అందుబాటులో ఉంది. అయితే స్టేబుల్ వాట్సాప్ యూజర్లకు ఈ ఫీచర్ ను ప్రవేశించడం ఇదే మొదటిసారి. కానీ స్టేబుల్ వాట్సాప్ యూజర్లకు ఈ ఫీచర్ ను ఎప్పుడు అందుబాటులోకి తెస్తుందనే దానిపై క్లారిటీ లేదు. అయితే త్వరలోనే ఇది సరికొత్త ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.19.221 తో వస్తుంది. వాట్సాప్ యూజర్లు దీన్ని సెట్టింగ్లలో ప్రారంభించాల్సిన అవసరం ఉంది. వాట్సాప్ అకౌంట్ ను ఇతరులు చూడకుండా లేదా వాడకుండా ఉండేందుకు ఈ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఫీచర్ ఉపయోపడుతుంది. ఇప్పుడు ఈ ఫీచర్ ఓపెన్ బీటాలో ఉంది. ఇది త్వరలో ఈ ఫీచర్ స్టేబుల్ వాట్సప్ యూజర్లకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆండ్రాయిడ్ తాజా వెర్షన్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.19.221 లో ఫింగర్ ప్రింట్ లాక్ ఎంపిక ప్రారంభించబడింది.
Whats-app

దీని కోసం ముందుగా వాట్సాప్ ను ఓపెన్ చేసి అందులో సెట్టింగులు మీద క్లిక్ చేయండి.
అందులో అకౌంట్ ఆప్షన్ ను ఓపెన్ చేసి > తరువాత పైవసీ ఆప్షన్ ఎంచుకోండి. 
చివరిగా అందులో ఫింగర్ ప్రింట్ లాక్ ను ఎంచుకోవడం ద్వారా ఫింగర్ ప్రింట్ లాక్ ప్రారంభించవచ్చు .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :